By: ABP Desam | Updated at : 03 Oct 2023 11:12 PM (IST)
Edited By: omeprakash
ఏఐఏఎస్‌ఎల్ నోటిఫికేషన్ - 2023
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ టెక్నిషియల్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & హ్యాండీ మ్యాన్/ఉమెన్ భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 323 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (ఇంజినీరింగ్ డిసిప్లిన్) కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు పోస్టుని అనుసరించి అక్టోబర్ 17, 18, 19 తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 323
➥ జూనియర్ ఆఫీసర్-టెక్నికల్: 05
➥ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 39
➥ హ్యాండీమ్యాన్/హ్యాండీ ఉమెన్: 279
అర్హతలు: 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (ఇంజినీరింగ్ డిసిప్లిన్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో. అభ్యర్థులు 'AI AIRPORT SERVICES LIMITED' పేరిట ముంబయిలో చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి. అభ్యర్థులు దరఖాస్తు, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలతోపాటు డిడిని జతచేసి సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ & ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకి ఇంటర్వ్యూ తేదీ: 17.10.2023.
➥ హ్యాండీమ్యాన్/ హ్యాండీ మహిళలకు ఇంటర్వ్యూ తేదీ: 18 & 19.10.2023.
➥ ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Incharge, HR Department
AI AIRPORT SERVICES LIMITED
( Formerly known as AIR INDIA AIR TRANSPORT SERVICES LTD.)
CSMI Airport, Sahar, Mumbai 400099.
ALSO READ:
ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
ఈస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 27న ప్రారంభంకాగా.. అక్టోబరు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్, డిగ్రీ అర్హతతో 444 ఉద్యోగాల భర్తీ
UCO Bank Notification: యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపిక ఇలా
Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?
/body>