AIASL: ముంబయి ఎయిర్‌పోర్టులో 998 హ్యాండీమ్యాన్ & యుటిలిటీ ఏజెంట్ పోస్టులు
ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 998 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 998
* హ్యాండీమ్యాన్: 971
* యుటిలిటీ ఏజెంట్ (పురుషులు): 20
* యుటిలిటీ ఏజెంట్ (మహిళలు): 07
అర్హత: హ్యాండీమ్యాన్- పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. యుటిలిటీ ఏజెంట్- పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు హిందీ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 33 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ స్క్రీనింగ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: నెలకు రూ.21,330.
చిరునామా: HRD Department, AI Airport Services Limited,
GSD Complex, Near Sahar Police Station, CSMI Airport,
Terminal-2, Gate No.5, Sahar, Andheri-East, Mumbai.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2023.
ALSO READ:
వైఎస్సార్ జిల్లాలో 85 అంగన్‌వాడీ పోస్టులు
వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రాజమండ్రి- ఏపీ సివిల్ సప్లయ్ విభాగంలో 717 ఖాళీలు, వివరాలు ఇలా!
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 717 టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 8 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..