Staff Nurse Recruitment: 5,204 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు - ఒక్కో పోస్టుకు ఏడుగురే పోటీ! పరీక్ష విధానం, సిలబస్ వివరాలు ఇలా!
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో స్టాఫ్ నర్సు పోస్టుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21న ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 5,204 ఉద్యోగాలకుగాను 40,100 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో స్టాఫ్ నర్సు పోస్టుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21న ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 5,204 ఉద్యోగాలకుగాను 40,100 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టులకు కేవలం 8 మంది మాత్రమే పోటీపడుతున్నారు. పోటీ తక్కువగా ఉండటంతో అభ్యర్థులు రాతపరీక్షకు మరింత ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నారు. రాతపరీక్ష ద్వారా వీరిని ఎంపిక చేయనున్నారు.
వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్టాఫ్ నర్స్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 25న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గడువు పొడిగించాలని తెలంగాణ నర్సింగ్ సమితి వినతి కోరింది. దీంతో వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
ప్రభుత్వం భర్తీచేయనున్న మొత్తం ఖాళీల్లో డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు OMR ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
సిలబస్ వివరాలు..
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 5,204 పోస్టులు
1) స్టాఫ్ నర్స్: 3,823 పోస్టులు
విభాగం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.
2) స్టాఫ్ నర్స్: 757 పోస్టులు
విభాగం: తెలంగాణ వైద్యవిధాన పరిషత్.
3) స్టాఫ్ నర్స్: 81 పోస్టులు
విభాగం: ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్.
4) స్టాఫ్ నర్స్: 08 పోస్టులు
విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజెబుల్డ్ అండ్ సీనియర్ సిటీజెన్స్ వెల్ఫేర్.
5) స్టాఫ్ నర్స్: 127 పోస్టులు
విభాగం: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.
6) స్టాఫ్ నర్స్: 197 పోస్టులు
విభాగం: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.
7) స్టాఫ్ నర్స్: 74 పోస్టులు
విభాగం: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం).
8) స్టాఫ్ నర్స్: 124 పోస్టులు
విభాగం: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.
9) స్టాఫ్ నర్స్: 13 పోస్టులు
విభాగం: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.
Also Read:
'గ్రూప్-2' ఉద్యోగాలు - ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ!
తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 5,51,943 దరఖాస్తులు అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొందరు అభ్యర్థుల ఫీజు చెల్లింపులు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
12,523 ఎంటీఎస్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 12,523 మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్‌టెక్నికల్), హవల్దార్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును వారంపాటు పొడిగిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎంటీఎస్ పోస్టుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 17తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..