త్వరలో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ: మంత్రి హరీష్‌రావు
రాష్ట్రంలో త్వరలోనే 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.
రాష్ట్రంలో త్వరలోనే 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను మంత్రి హరీష్‌రావు తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు.
హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం (ఫిబ్రవరి 20) జరిగిన ‘ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్’లో ఆయన మాట్లాడారు. పేట్ల బురుజు మాదిరిగానే ప్రతి ఆస్పత్రి ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.
పేట్ల బురుజు ఆస్పత్రికి ఎక్కువగా క్రిటికల్ కేసులు వస్తాయని, కాబట్టి ఇక్కడ మరణాల సంఖ్య పెరగకుండా చూడాలని సంబంధిత అధికారులను, వైద్య సిబ్బందిని మంత్రి కోరారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది బాలింతలు, గర్భిణిలకు న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వచ్చే నెలలో నిమ్స్ ఆస్పత్రిలో ఎంసీహెచ్ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం ఎంసీహెచ్ ఆస్పత్రుల సంఖ్యను పెంచామని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో గర్భిణీల్లో సమస్యలను గుర్తిస్తే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేగాక మాతాశిశు మరణాలపై లోతైన విశ్లేషణ చేయాలని సూచించారు.
Speaking at Infection Prevention, Early Detection and Management Program in Petla Burj Govt Maternity Hospital https://t.co/QUYXNLSkSp
— Harish Rao Thanneeru (@BRSHarish) February 20, 2023
Also Read:
'గ్రూప్-2' ఉద్యోగాలు - ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ - వారం రోజుల్లో పరీక్ష తేదీ ప్రకటన!
తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 5,51,943 దరఖాస్తులు అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొందరు అభ్యర్థుల ఫీజు చెల్లింపులు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పేపర్-1, పేపర్-2 పరీక్షల ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్‌ఐ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం పోలీసు నియామక బోర్డు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాల నమోదుచేసుకునే వెసులుబాటు ఉంది. నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా తెలపాల్సి ఉంటుంది. మరే ఇతర విధానాల్లోనూ అభ్యంతరాలను స్వీకరించబోరు.
ఎస్ఐ రాతపరీక్ష ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..