News
News
వీడియోలు ఆటలు
X

వైద్యారోగ్య శాఖ‌లో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, ఉత్తర్వులు జారీ!

తెలంగాణ వైద్యారోగ్య శాఖ‌లో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏడు విభాగాల్లో ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తున్న‌ట్లు జీవోలో పేర్కొన్నారు.

FOLLOW US: 
Share:

 తెలంగాణ వైద్యారోగ్య శాఖ‌లో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏడు విభాగాల్లో ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వుల‌ను ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అంద‌జేశారు.

మొత్తం 40 విభాగాల్లో, 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఏప్రిల్ 30వ తేదీన ఉత్త‌ర్వులు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. నూత‌న స‌చివాల‌యం ప్రారంభోత్స‌వం అనంత‌రం సీఎం కేసీఆర్ త‌న చాంబ‌ర్‌లో ఆసీనులై కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ద‌స్త్రంపై సంత‌కం చేసిన విష‌యం విదిత‌మే. దీంతో ఆయా విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ ఆయా శాఖ‌లు ప్ర‌త్యేకంగా ఉత్త‌ర్వులు జారీ చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఉన్న‌త విద్యాశాఖ‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డిన విష‌యం తెలిసిందే.

కుటుంబ సంక్షేమ శాఖలో 68 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (మహిళ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 72, 156 ఫార్మసిస్టులు, 177 ల్యాబ్ టెక్నీషియన్లు, 2 డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద ఉన్నారు. పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, 837 మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (పురుషుడు) 837, ఆయుష్ విభాగంలో 19 మంది మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే మొత్తం 1331 మంది రెగ్యులరైజ్ అయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణపై యూనియన్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కలలు సాకారమై తమ జీవితాల్లో వెలుగులు నింపారని పలువురు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జీవితాంతం గుర్తుండిపోతారన్నారు. మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read:

ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల!
తెలంగాణలో డీఎంఈ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మే 2న విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న చోట కనీసం రెండేళ్ల సర్వీస్‌ పూర్తయినవారు మాత్రమే బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడికల్‌ కళాశాలల్లోని ఖాళీలను మాత్రమే బదిలీల ద్వారా భర్తీ చేస్తారు. ఒకవేళ బదిలీ కోసం పెట్టుకున్న దరఖాస్తులు 17 కాలేజీల్లోని ఖాళీల కంటే ఎక్కువ ఉంటే నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఖాళీల్లో భర్తీ చేస్తారు. ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ‌ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆదేశాల మేర‌కు డీఎంఈ ప‌రిధిలోని ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల బ‌దిలీల‌కు వైద్యారోగ్య శాఖ ఈ మార్గదర్శకాలు విడుద‌ల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఆరోగ్య తెలంగాణ సాకారం చేసేందుకు కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు ఈ సందర్బంగా ఆకాంక్షించారు. ప్రస్తుతం ప‌నిచేస్తున్న చోట క‌నీసం రెండేళ్ల స‌ర్వీస్ పూర్తయిన వారు మాత్రమే ద‌ర‌ఖాస్తుకు అర్హులని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడిక‌ల్ కాలేజీల్లోని ఖాళీల‌ను మాత్రమే బ‌దిలీల ద్వారా భ‌ర్తీ చేయనున్నారు. 
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Published at : 05 May 2023 05:54 AM (IST) Tags: Contract Employees TS Health department Regularizing Jobs Multipurpose Health Assistants DME Medical Officers in AYUSH

సంబంధిత కథనాలు

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?