News
News
X

చేతులూ, కాళ్లు తరచూ తిమ్మిర్లు పడుతున్నాయా? అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్లే

చేతులూ, కాళ్లు తిమ్మిరి పెట్టడాన్ని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ అది కూడా అనారోగ్యానికి ఒక సంకేతమే.

FOLLOW US: 
Share:

కొంతమందిలో కాళ్లు, చేతులు తరచూ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల అలా జరుగుతుందని కొంతమంది చెబుతుంటారు. అలా తిమ్మిర్లు పెట్టాక రెండు నుంచి మూడు నిమిషాలు చేతులు, కాళ్లు కదపలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగినప్పుడే ఇలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయని చెబుతారు. తిమ్మిర్లు అప్పుడప్పుడు వస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తరచూ వస్తే మాత్రం కచ్చితంగా వాటిని సీరియస్‌గా తీసుకోవాలి. ముఖ్యంగా మద్యం తాగే వారు, షుగర్ వ్యాధితో ఉన్నవారు మాత్రం ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చేతులు కాళ్లలో తరచూ తిమ్మిర్లు రావడం అనేది విటమిన్ బి12 లోపానికి ఒక సంకేతం.

మన శరీరానికి విటమిన్ బి12 అత్యవసరమైనది. ఇది లోపిస్తే శరీరం అనేక అనారోగ్యాల బారిన పడుతుంది.ఎర్ర రక్త కణాల తయారీలో, నాడీ వ్యవస్థ పనితీరులో, శరీర ఎదుగుదలకు విటమిన్ బి12 చాలా అవసరం. ఇది లోపిస్తే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అంతేకాదు అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కాదు. దీనివల్లే తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. విటమిన్ లోపిస్తే నరాల సమస్యలతో పాటు వెరికోస్ వీన్స్, సయాటికా వంటి సమస్యలు వేధిస్తాయి.

తిమ్మిర్లు అధికంగా పడుతున్నా, అరిచేతులు, అరికాళ్ళలో సూదులు గుచ్చుతున్నట్టు అనిపిస్తుంటే విటమిన్ బి12 లోపం ఉందేమో అని చెక్ చేసుకోవాలి. అలాగే విటమిన్ బి12 నిండుగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మాంసం, పాలు, పెరుగు, చేపలు వంటి వాటిల్లో బి12 పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటూనే యాపిల్ సిడర్ వెనిగర్ కూడా తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. తిమ్మిర్లు అధికంగా వస్తున్న వారు నీటిని అధికంగా తాగాలి. ఎందుకంటే విటమిన్ బి12 అనేది నీటిలో కరిగే విటమిన్. అది శరీరంలో లోపించిందంటే డిహైడ్రేషన్ వల్ల కూడా కావచ్చు. కాబట్టి నీటిని అధికంగా తింటూ చేతులు కాళ్లకు కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం తగ్గుముఖం పడుతుంది.

విటమిన్ బి12 సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. వైద్యులను సంప్రదించాక వాటిని తీసుకోవడం వల్ల కూడా ఈ లోపాలను అధిగమించవచ్చు. ఎవరికి వారు సొంతంగా సప్లిమెంట్లను తీసుకోవడం పద్ధతి కాదు. వైద్యుల సూచన మేరకే వాటిని తీసుకోవాలి. 

Also read: నిమ్మకాయ కన్నా నిమ్మ విత్తనాలలోనే అద్భుత గుణాలు, వాటిని దాచి ఇలా చేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 27 Feb 2023 06:49 PM (IST) Tags: Vitamin B12 deficiency Cramps Tingling Vitamin B12 rich food

సంబంధిత కథనాలు

పెదవులు పొడిబారుతున్నాయా? అలసటగా ఉందా? అయితే, ప్రమాదమే - వెంటనే ఇలా చేయండి

పెదవులు పొడిబారుతున్నాయా? అలసటగా ఉందా? అయితే, ప్రమాదమే - వెంటనే ఇలా చేయండి

International Day Of Happiness: సంతోషమే సగం బలం - హ్యాపీగా ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

International Day Of Happiness: సంతోషమే సగం బలం - హ్యాపీగా ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Vitamin A: విటమిన్ A లోపిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Vitamin A: విటమిన్ A లోపిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

ఇన్ఫ్లూయేంజా వల్ల జలుబు, జ్వరంతో బాధపడుతున్నారా? ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ డైట్ లో చేర్చుకోండి

ఇన్ఫ్లూయేంజా వల్ల జలుబు, జ్వరంతో బాధపడుతున్నారా? ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ డైట్ లో చేర్చుకోండి

Weight Loss Tips: డైటింగ్ చేయకుండా, వ్యాయామం లేకుండా బరువు తగ్గే సులభమైన పద్ధతులు ఇదిగో

Weight Loss Tips: డైటింగ్ చేయకుండా, వ్యాయామం లేకుండా బరువు తగ్గే సులభమైన పద్ధతులు ఇదిగో

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !