News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

వేడి వాతావరణంలో వేడి నీటి ద్వారా వ్యాప్తి చెందే ప్రాణాంతక బ్యాక్టీరియా గురించి నిపుణులు హెచ్చరిస్తున్నరు. తీవ్రమైన న్యూమోనియా వంటి ఈ ఇన్ఫెక్షన్ ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.

FOLLOW US: 
Share:

వేడి వాతావరణంలో సూక్ష్మ జీవుల వ్యాప్తి తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ కొన్ని రకాల బ్యాక్టీరియాలు వేసవిలో చాలా విస్తృతంగా వ్యాపిస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి లాజియోనెల్లా అనే బ్యాక్టీరియా.  లెజియోనైర్స్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లెజియోనెల్లా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా కలిగిన డ్రాప్లెట్స్ ను పీల్చుకోవడం ద్వారా ఆ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ లెజియోనెల్లా బ్యాక్టీరియా జాకూజీలు, హాట్ టబ్స్, కుళాయిలు, షవర్ హెడ్స్ ఇతర తడిగా ఉండే గార్డెన్ పాటింగ్ కంపోస్టుల్లో కూడా వీటి సంఖ్యను పెంచుకోగలవు. గార్డెనర్ వాటర్ క్యాన్స్, స్పిక్లర్లు, హాస్పైప్స్ లో దాగి ఉంటుంది.

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులకు ఇది త్వరగా సంక్రమిస్తుందని చెప్పవచ్చు. వృద్ధులు, పొగతాగే అలవాటు ఉన్నవారిలో నిరోధక వ్యవస్థ  సహజంగానే బలహీనంగా ఉంటుంది. కనుక వీరికి త్వరగా ఈ ఇన్ఫెక్షన్ సోకవచ్చు. లెజియోనెల్లా బ్యాక్టీరియా పాంటియాక్ ఫీవర్ కు కూడా కారణం కావచ్చు. ఫ్లూ లాగే అనిపించే తేలిక పాటి అనారోగ్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా దానికదే తగ్గిపోతుంది. కానీ లేజియోనైర్స్ వ్యాధి మాత్రం సరైన సమయంలో చికిత్స అందక పోతే ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. చికిత్సతో వ్యాధి నయం అయినప్పటికీ కొందరిలో తర్వాత కూడా సమస్యలు అలాగే ఉండిపోతాయి.  

బ్రిటన్ లో ఐదుగురు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత ఒక కంపెనీని ప్రాసీక్యూట్ చేసిన తర్వాత బ్రిటన్ ఆరోగ్య వ్యవస్థ ఈ విషయాన్ని గురించిన హెచ్చరికలు జారీ చేసింది. వీరిలో ఒకరికి ఇంటెన్సివ్ కేర్ అవసరం పడింది. వేడి వాతావరణంలో సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందే ప్రమాదం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించింది.

లెజియోనైర్స్ ఇన్ఫెక్షన్ ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం, అలసట, చలిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన మొదట్లో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పటికీ ఇన్ఫెక్షన్ ఊపిరి తిత్తులకు చేరినపుడు మాత్రం న్యూమోనియా వంటి లక్షణాలు కనబరుస్తుంది. ఈ స్థాయిలో ఛాతిలో నొప్పి, నిరంతరాయంగా దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అయితే ఈ వ్యాధిని సమర్థవంతంగా నివారించడం సాధ్యమే అని నిపుణులు సూచిస్తున్నారు. లేజియోనైర్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా హాట్ టబ్లు, స్పాలలో క్లోరిన్ వంటి క్రిమి సంహారకాలు అవసరమయ్యే స్థాయి పీహెచ్ లో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఈ వ్యాధి సోకిన తర్వాత జీవితం ఎంత నరకప్రాయంగా మారిందో ఒక ఓ బాధితురాలు యూకే మీడియాకు వెల్లడించింది.

HSE Riaar Plastics Limited అనే కంపెనీలో ఐదుగురు ఈ వ్యాధి బారిన పడిన తర్వాత అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి కూలింగ్ టవర్ల నిర్వహణ సరిగ్గా లేనట్టు కనుగొన్నారు. ఐదుగురిలో ఒకరిని ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స అందించాల్సి వచ్చింది. కంపెనీకి భారీ మొత్తంలో జరిమానా విధించారు.

హాట్ టబ్ లు, షవర్ హ్యాండిల్స్ ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వ్యాధి గురించి అత్యవసర హెచ్చరికలు కూడా బ్రిటన్ ఆరోగ్యశాఖ వెలువరించింది. ఇన్ఫెక్షన్ సోకినట్టు అనుమానం కలిగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని, వెంటనే చికిత్స పొందాలని పేర్కొంది.

Also read : గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 08 Jun 2023 04:06 PM (IST) Tags: Bacteria hot weather urgent summer warning

ఇవి కూడా చూడండి

Alzheimer's:  మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!

Alzheimer's: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!

Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా- ఈ టిప్స్ పాటించండి రిలీఫ్ పొందుతారు

Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా- ఈ టిప్స్ పాటించండి రిలీఫ్ పొందుతారు

Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!

Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!

Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా-  మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

టాప్ స్టోరీస్

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Women's Reservation Bill: ప్రధానితో మహిళా ఎంపీల ఫొటోలు, స్వీట్లు పంపిణీ

Vande Bharat Express: నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు - 25 రకాల మార్పులు  

Vande Bharat Express: నూతన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు - 25 రకాల మార్పులు