
Omicron Cases in Kerala: కేరళలో హై అలర్ట్.. ఒకేసారి 44 ఒమిక్రాన్ కేసులు.. సిక్కింలో ఆంక్షలు
కేరళలో ఒక్కరోజే 44 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 107కు చేరింది.

కేరళలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 44 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 107కు చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
Total 44 new #Omicron cases reported in Kerala today, taking the total tally to 107. Genomic sequencing samples are being sent, sentinel surveillance underway. So far, 98% eligible population has been inoculated with 1st dose,79% with 2nd dose: Kerala Health Minister Veena George pic.twitter.com/Rr2jNncBYX
— ANI (@ANI) December 31, 2021
కేరళలో కొత్తగా 2,676 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. 2,742 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 19,416కు చేరగా మరణాల సంఖ్య 47,794కు పెరిగింది.
సిక్కింలో ఆంక్షలు..
ఒమిక్రాన్ భయాల కారణంగా సిక్కింలో 2022 జనవరి 10 వరకు ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పబ్‌లు, డిస్కోలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, జిమ్‌లు, బార్బర్ షాపులు, సెలూన్లు వంటి వాటిని 50 శాతం సామర్థ్యంతోనే నడపాలని ఆదేశించింది.
సామాజిక, రాజకీయ సభలకు కచ్చితంగా జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేసింది. ఈ సభలను కూడా 50 శాతం సామర్థ్యంతోనే నిర్వహించాలని పేర్కొంది.Also Read: Omicron Death: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. గజగజ వణుకుతోన్న జనం!
Also Read: Omicron Cases India: దేశంలో కొత్తగా 16,764 మందికి కరోనా.. 1200 దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: Kannauj IT Raid: పుష్ప.. పుష్పరాజ్.. ఫ్లవర్ అనుకుంటివా? అత్తరు.. ఈ కథే వేరు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

