By: ABP Desam | Updated at : 17 Jan 2023 03:19 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
పని ఒత్తిడి, అనారోగ్య జీవనశైలి, డీహైడ్రేషన్, నిద్రలేకపోవడం, స్క్రీనింగ్ టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పి వస్తుంది. కొన్ని సార్లు ఆహారం వల్ల కూడా వస్తుంది. కొంతమంది తలనొప్పిగా అనిపిస్తే కళ్ళ సైట్ పెరగడం కూడా ఒక కారణంగా భావిస్తారు. చాలా మంది ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కానీ అవి తాత్కాలిక ఉపశమనం అందిస్తాయి. తరచూ మందులు వేసుకోవడం వల్ల తర్వాత వాటి వల్ల అనేక దుష్ప్రభావాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా తలనొప్పిని వదిలించుకోవడానికి కేవలం 10 సెకన్లలో ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అయితే మీకు తలనొప్పి రకాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని నయం చేయడం త్వరగా వీలవుతుంది.
తలనొప్పి రావడానికి కారణాలు
⦿ విపరీతమైన కోపం
⦿ నిద్రపోవడానికి పడుకునే భంగిమ సరిగా లేకపోవడం
⦿ సువాసన అలర్జీలు
⦿ వాతావరణ ప్రభావం
⦿ ప్రకాశవంతమైన దీపాలు చూడటం
⦿ కొన్ని ఆహారాలు
⦿ పళ్ళు నొప్పులు
⦿ డీహైడ్రేషన్
⦿ హార్మోన్ల అసమతుల్యత
⦿ అధిక కెఫీన్, ఆల్కాహాల్ వినియోగం
⦿ మందులు ఎక్కువగా వాడటం
10 సెకన్లలో నొప్పిని తగ్గించుకోవడం ఎలా?
మస్సెటర్ కండరం అనేది శరీరంలోని బలమైన కండరం. ఇది ముఖం, చెంప, దవడ చుట్టూ ఉంటుంది. దవడని కదిలించడానికి ఇది ఉపయోగపడుతుంది. మెడ, భుజాలు, తలపై ఎక్కువగా ఒత్తిడి పడినప్పుడు ఈ కండరం అసౌకర్యంగా ఉంటుంది. ఈ కండరాల వల్ల వచ్చే తలనొప్పిని సాధారణ మసాజ్ ద్వారా పోగొట్టుకోవచ్చు.
మసాజ్ ఎలా చేయాలి?
మీ వేళ్ళతో చెంప ఎముక కింద మస్సెటర్ కండరం మీద సున్నితంగా లోపలికి నొక్కుతూ మసాజ్ చేసుకోవాలి. అలా చేసేటప్పుడు కొద్దిగా నోరు తెరుస్తూ మూస్తూ ఉండాలి. కొన్ని సెకన్ల తర్వాత ఈ కండరం రిలాక్స్ అవుతుంది. తలనొప్పి తగ్గుతుంది. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు దవడలు బిగిస్తారు. అలాంటి వాళ్ళు ఈ టెక్నిక్ పాటిస్తే అద్భుతంగా పని చేస్తుంది. త్వరగా ఉపశమనం లభిస్తుంది. నిద్రలో పళ్ళు కోరికే వాళ్ళకి కూడా తలనొప్పి వస్తుంది. వాళ్ళు కూడా ఈ టెక్నిక్ పాటిస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎక్కువగా టెన్షన్ వల్ల తలనొప్పి వస్తుంది. ఇది కొద్ది కొద్దిగా మొదలై తీవ్రరూపం దాలుస్తుంది. దీని వల్ల చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా అనిపిస్తుంది. తల రెండు వైపులా వ్యాపించే ఈ నొప్పి వల్ల కంటి నొప్పి కూడా వస్తుంది.
టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి లక్షణాలు
⦿ నొప్పి తగ్గకుండా ఎక్కువ సేపు ఉండటం
⦿ నుదిటిపై లేదా తల అన్ని వైపులా బిగుతుగా అనిపించిడం
⦿ ఒత్తిడి, ఆందోళన
⦿ తల చర్మం, మెడ, భుజం కండరాల్లో సున్నితత్వం. వాటిని పట్టుకుంటేనే నొప్పిగా అనిపిస్తుంది.
⦿ టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి దీర్ఘకాలికంగా ఉంటుంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే మైగ్రేన్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: PCOS అంటే ఏమిటీ? హార్మోన్లు సమతుల్యత కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?
గీజర్లో ఉండే గ్యాస్ లీక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
Cough: దగ్గు వచ్చినప్పుడు ఆపుకుంటున్నారా? దగ్గడం ఎంత ముఖ్యమో తెలుసా
Screen Time: ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల కంటిచూపుకే కాదు - చర్మం, జుట్టుకూ నష్టమే
Cauliflower: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు
Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Warner as Pathaan: 'పఠాన్' గా అదరగొట్టిన డేవిడ్ వార్నర్- ఆస్కార్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్