News
News
వీడియోలు ఆటలు
X

ఇన్ఫ్లూయేంజా వల్ల జలుబు, జ్వరంతో బాధపడుతున్నారా? ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ డైట్ లో చేర్చుకోండి

కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఇన్ఫ్లూయేంజా వేరియంట్ H3N2 వ్యాపిస్తోంది.

FOLLOW US: 
Share:

కరోనా వైరస్ సృష్టించిన అల్లకల్లోలాన్ని ప్రపంచ దేశాలు చవిచూశాయి.  ఇంకా దశ నుంచి బయటపడక ముందే మన దేశంపై ఇన్ఫ్లూయేంజా దాడి చేసింది. ఇప్పటికే ఎంతోమంది ఈ ఫ్లూ బారిన పడుతున్నారు, వైరల్ ఫీవర్లు, జ్వరం, జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల మరణాలూ సంభవిస్తున్నాయి. ఈ ఫ్లూ చాలామంది తేలికగా తీసుకుంటున్నారు.  ప్రభుత్వం జారీ చేసిన సలహా ప్రకారం ఈ ఫ్లూ... పిల్లలు, వృద్దులపైనే ప్రతాపం చూపిస్తోంది. కాబట్టి కోవిడ్ మాదిరిగానే మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ వైరస్ కళ్ళు, ముక్కు, నోటి ద్వారా వ్యాపిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఈ ఫ్లూ నుంచి బయటపడవచ్చు. ఇందుకోసం ఐదు సూపర్ ఫుడ్‌లను మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 

దాల్చిన చెక్క 
ఇది రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం. దీనిలోని ఔషధ లక్షణాల కారణంగా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ అని పిలిచే హానికరమైన కణాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దాల్చిన చెక్కలో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం.  కాబట్టి కూరల్లో దాల్చిన చెక్కను వేసి వండుకోవడం ఉత్తమం. 

మెంతులు 
మెంతి గింజల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువ. దీనిలో సపోనిన్లు, ఫ్లేవనోయిడ్లు, ఆల్కలాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. తెల్ల రక్త కణాలు మన శరీరంలో చేరిన వైరస్‌లతో పోరాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం మెంతి గింజలను తినాలి లేదా మెంతిపొడిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

అల్లం 
దగ్గు, గొంతు నొప్పి వేధిస్తున్నప్పుడు ఎక్కువమంది అల్లం టీ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. దీనికి కారణం అల్లంలో ఉన్న ఔషధ గుణాలే. ఇవి వైరస్‌ల నుంచి కాపాడే శక్తి కలిగి ఉంటుంది.  అల్లం లోని యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని బ్యాక్టీరియా పెరుగుదల నుంచి కాపాడతాయి. తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంలో కూడా అల్లం ముందుంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

పసుపు 
సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న శక్తివంతమైన పదార్థం పసుపు. దీనిలో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులతో పోరాడే శక్తిని మన శరీరానికి ఇస్తుంది. ఆహారంలో పసుపును భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుతుంది.

లవంగాలు 
రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్న లవంగాలు రోజువారీ ఆహారంలో తినాల్సిన అవసరం ఉంది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికం.  అలాగే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ.  కాబట్టి లవంగాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఫ్లూ వంటి వైరస్‌లను తట్టుకోవచ్చు.

Also read: డైటింగ్ చేయకుండా, వ్యాయామం లేకుండా బరువు తగ్గే సులభమైన పద్ధతులు ఇదిగో

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 20 Mar 2023 10:19 AM (IST) Tags: Influenza Cold and Fever Superfoods for influenza

సంబంధిత కథనాలు

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?

ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?

Diabetes Diet Plan: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు

Diabetes Diet Plan: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు

Sleeping: జంక్ ఫుడ్ లాగించేస్తున్నారా? మీకు నిద్రపట్టడం కష్టమే!

Sleeping: జంక్ ఫుడ్ లాగించేస్తున్నారా? మీకు నిద్రపట్టడం కష్టమే!

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు