News
News
వీడియోలు ఆటలు
X

Weight Loss Tips: డైటింగ్ చేయకుండా, వ్యాయామం లేకుండా బరువు తగ్గే సులభమైన పద్ధతులు ఇదిగో

బరువు తగ్గాలంటే డైటింగ్ చేయాలని, తీవ్రమైన వ్యాయామాలు చేయాలని అంటారు. లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు.

FOLLOW US: 
Share:

ప్రపంచంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి అధిక బరువు. శరీర బరువును నియంత్రించుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. బరువు పెరుగుతున్న కొద్దీ శరీరానికి వచ్చే రోగాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కాబట్టి అందరూ బరువును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. బరువు తగ్గాలంటే డైటింగ్ చేయాలని లేదా రోజూ వ్యాయామాలు చేయాలని చెబుతారు. ఆ రెండూ అవసరం లేకుండా, బరువు తగ్గడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ జీవనశైలిని కొంచెం మార్చుకోవాలి.

1. ఆహారాన్ని తినేటప్పుడు వేగంగా తినకూడదు. నెమ్మదిగా తినాలి. నోట్లో ఆహారాన్ని ఎక్కువ సేపు నమలాలి. ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే తక్కువ ఆహారాన్ని తింటారు. నిదానంగా తినే వారి కంటే వేగంగా తినేవారు బరువు పెరిగే అవకాశం ఎక్కువ అని చెబుతున్నారు పరిశోధకులు. వేగంగా తింటున్నప్పుడు ఎంత తింటున్నారో తెలియకుండా ఎక్కువ మొత్తం తినేస్తారని, దీని వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు నిరూపించాయి.

2. ఉదయం నుంచి రాత్రి వరకు సాంప్రదాయంగా మూడుసార్లు భోజనం చేస్తారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.  బరువు తగ్గాలనుకునేవారు మాత్రం ఆరు నుంచి ఏడు సార్లు తినాలి. అది కూడా చాలా తక్కువ మొత్తంలో. ఇలా చిన్న చిన్న భాగాలుగా ఆహారాన్ని చేసుకుని తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అయితే ఆ ఏడు భాగాలను కలిపినా కూడా మీరు మూడు పూటలా తినేంత ఆహారం ఉండకూడదు.

3. ప్రోటీన్ మన ఆకలి పై శక్తివంతంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రొటీన్ ఉన్న ఆహారం తింటే పొట్ట నిండిన భావన త్వరగా వస్తుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించాలి. ఉదాహరణకు చికెన్, చేపలు, పెరుగు, బాదంపప్పులు, క్వినోవా వంటివి మీ ఆహారంలో చేర్చుకోవాలి.

4. అనారోగ్యకర ఆహారాలైన పిజ్జాలు, బర్గర్లు, తీపి పదార్థాలు, కేకులు వంటివన్నీ మీ కంటి ముందు లేకుండా చూసుకోండి. వాటిని చూస్తే తినాలన్న కోరిక పెరిగిపోతుంది.

5. ప్రోటీన్ లాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కూడా త్వరగా పొట్ట నిండిన భావన వస్తుంది. మొలకలు, నారింజలు, అవిసె గింజలు వంటివి తినేందుకు ప్రయత్నించండి.

6. నీరు ఎక్కువగా తాగితే ఆకలి తగ్గుతుంది. నీరు తాగడం వల్ల తక్కువగా తినే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఏదైనా భోజనం చేసే ముందు నీరు తాగి అప్పుడు భోజనానికి వెళ్ళండి. మీకు తెలియకుండానే చాలా తక్కువ తింటారు. తద్వారా బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.

7. తింటున్నప్పుడు టీవీ, ఫోను చూడడం మానేయండి. వాటి ధ్యాసలో పడి ఎంత తింటున్నారు? అనేది కూడా మీకు తెలియదు. దీనివల్ల ఎక్కువ తినేసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని అధ్యయనాలు కూడా నిరూపించాయి.

8. ఒత్తిడి తగ్గించుకోండి. ఒత్తిడిలో ఆకలి ఎక్కువ వేస్తుంది. దీనివల్ల ఎక్కువగా తినేసే అవకాశం ఉంది. అలాగే సరిపడా నిద్రపోవాలి, లేకుంటే ఒత్తిడి పెరిగి ఆకలి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల ఆహారం అధికంగా తినే అవకాశం ఉంది.

9. తీపి పదార్థాలను పక్కన పెట్టండి. సోడా, కూల్ డ్రింకులు వంటివి పూర్తిగా మానేయాలి. ఈ చక్కెర కలిపిన పానీయాలు బరువు త్వరగా పెరిగేలా చేస్తాయి.

Also read: ఈ ఊరు మొత్తాన్ని అద్దెకిచ్చేస్తారు, స్నేహితులతో వేడుకలకు ఇది పర్‌ఫెక్ట్ ప్లేస్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 20 Mar 2023 10:11 AM (IST) Tags: Weight Loss Tips Weight Loss Easy ways to Weight Loss

సంబంధిత కథనాలు

Diabetes: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది

Diabetes: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది

Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ

Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ

kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా

kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు