భారత్‌లో 16 లక్షల మందికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ముప్పు! 2008-2017 మధ్య పుట్టినవారికి హెచ్చరిక, కారణం ఇదే!
cancer: 2008 2017 మధ్య జన్మించిన 15.6 మిలియన్ల మంది వ్యక్తులు తమ జీవితకాలంలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వెల్లడయింది. ఎందుకంటే ?

Stomach cancer Study warns million of Indians born after 2008 at risk: 2008-2017 మధ్య జన్మించిన వారిలో ప్రపంచవ్యాప్తంగా 15.6 మిలియన్ల మంది గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం అంచనా వేసింది. ఈ కేసులలో 76 శాతం హెలికోబాక్టర్ పైలోరీ (H. pylori) అనే బాక్టీరియా కారణం అవుతుందని తెలిపింది. మొత్తం కేసులలో మూడింట రెండు వంతులు (10.6 మిలియన్లు) ఆసియాలో ఉంటాయని, ఇందులో భారతదేశం , చైనా కలిపి 6.5 మిలియన్ల కేసులను నమోదు చేయవచ్చని అధ్యయనం తెలిపింది. భారతదేశంలో మాత్రమే 1,657,670 కేసులు ఉండవచ్చని అంచనా.
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) క్యాన్సర్ రీసెర్చ్ విభాగం ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇది 185 దేశాల నుంచి GLOBOCAN 2022 డేటాబేస్‌ను, ఐక్య రాజ్య సమితి జనాభా డేటాను ఉపయోగించి సిద్ధం చేశారు. ఈ అధ్యయనాన్ని పీర్-రివ్యూడ్ జర్నల్ *Nature Medicine*లో ప్రచురించారు. H. pylori అనే బాక్టీరియా గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా గుర్తించారు.ఈ బాక్టీరియా కడుపులో స్థిరపడి, దీర్ఘకాలంగా ఉనికి లేకుండా ఉటుంది. తరవాత దీర్ఘకాలిక వాపు, అల్సర్లు, చివరికి క్యాన్సర్‌కు కారణం అవుతుందని గుర్తించారు.
Published in @NatureMedicine *: Among those born 2008–2017, 15.6 million lifetime gastric cancer cases are expected—76% of which are attributable H. pylori.
— ilyas sahin, MD (@ilyassahinMD) July 7, 2025
H. pylori is easily treatable—making population screening urgent, especially in Asia, the Americas and Africa. pic.twitter.com/LTiYjqouzW
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్-సంబంధిత మరణాలలో టాప్ ఫైవ్‌లో ఉంది. భారతదేశంలో 2008-2017 మధ్య జన్మించిన వారిలో 1.6 మిలియన్లకు పైగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులు నమోదు కావచ్చని అధ్యయనం అంచనా వేసింది. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు , ప్రారంభ స్క్రీనింగ్‌లో ఉన్న లోపాలు ఈ క్యాన్సర్ భారాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని అధ్యయనం అంచనా వేసింది. అయితే H. pylori సంక్రమణకు స్క్రీనింగ్ , చికిత్స ద్వారా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులను 75 శాతం వరకు నివారించవచ్చని చెబుతున్నారు.
ఆసియా తర్వాత అమెరికాస్‌లో కూడా గణనీయమైన కేసులు ఉంటాయని అంచనా. ఈ అధ్యయనం గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించింది. 2008-2017 మధ్య జన్మించిన వారు ప్రస్తుతం టీనేజ్ లేదా ప్రీ-టీన్ వయస్సులో ఉన్నవారికి స్క్రీనింగ్ , చికిత్స కార్యక్రమాలు పెంచాలని అధ్యయనం సూచిస్తోంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మెరుగైన స్క్రీనింగ్ కార్యక్రమాలు, అవగాహన పెంపొందించడం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేయడం అవసరం. నిపుణులు సలహాలిస్తున్నారు.





















