Hypersomnia: అతినిద్రా? ఈ కారణాల వల్లేమో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది
Health Tips in Telugu | నిద్ర తక్కువైనా కష్టమే, ఎక్కువైనా కష్టమే. అసలు ఎందుకు ఎక్కువ నిద్రపోతారు? కారణాలేమిటి? అది ఆరోగ్యకరమేనా?
Sleepiness Telugu News | సాధారణంగా ప్రతి ఒక్కరికి 7-8 గంటల నిద్ర అవసరమవుతుంది. కొందరు అంతకంటే తక్కువ నిద్రిస్తారు. కొందరికి నిద్ర పట్టడం ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. దీన్ని ఇన్సోమ్నియా అంటారు. నిద్ర లేమి సమస్య గురించి చాలా మంది చెప్పుకోవడం చూస్తుంటాము కానీ అతి నిద్ర కూడా సమస్యే అని మీకు తెలుసా? దీనిని హైపర్సోమ్నియా అంటారు. రాత్రి తగినంత నిద్రపోయినా సరే నిద్ర చాలినట్టు అనిపించదు వీరికి. మధ్యాహ్నం ఎక్కువ సమయం నిద్ర మత్తు ఆవహించి ఉంటుంది. ఇలా నిద్ర మత్తుగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏకాగ్రతతో ఉండలేకపోవడం, పనిలో ఆటంకాలు రోజు వారి జీవితం చాలా ప్రభావితం అవుతుంది. ఈ సమస్యకు కారణాలనేకం. అవేమిటో పరిష్కారాలు ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హైపర్సోమ్నియా లక్షణాలు
ఆకలి మందగించడం
పనిలో ఏకాగ్రత లేకపోవడం
రోజంతా నిద్రమత్తుతో ఇబ్బంది పడడం
విసుగు, చిరాకుగా ఉండడం
మతిమరుపు
అలసటగా, బలహీనంగా అనిపించడం
అసలెందుకు ఎక్కువ నిద్ర?
నిద్ర సమస్యలు
ముందుగా మాట్లాడుకోవాల్సింది నద్రకు సంబంధించిన రుగ్మతల గురించి. వీటిలో ముఖ్యమైంది స్లీప్ ఆప్నీయా. నిద్రలో ఉన్నపుడు శ్వాస సరిగా ఆడక గురక వస్తుంది. ఈ సమస్య తీవ్రంగా ఉన్నపడు తరచుగా నిద్రకు ఆటంకం ఏర్పడి ఎనిమిది గంటల పాటు నిద్రపోయినా సరే నిద్ర చాలిన భావన కలుగదు. రోజంతా నిద్రమత్తులో జోగుతున్న భావన కలుగుతుంది.
నార్కోలెప్సీ అనేది ఒక నాడీ సంబంధ సమస్య. ఈ సమస్య తలెత్తితే సమయం, సందర్భం లేకుండా నిద్రపోవాలని అనిపిస్తుంది. నిద్ర ముంచుకుని వస్తుంది.
మెడికల్ సమస్యలు
హైపోథైరాయిడిజం(Hypothyroidism): తగినన్ని థైరాయిడ్ హార్మోన్లు శరీరంలో ఉత్పత్తి కాకపోతే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ధీని కారణంగా శఈరంలో శక్తి తగ్గిపోవడం వల్ల ఎల్లప్పుడు అలసటగా అనిపిస్తుంది. వీలైతే పడుకోవాలని అనిపిస్తుంటుంది. రోజంతా డ్రోజీగా ఉన్న భావన కలుగుతుంది.
మానసిక ఆరోగ్య సమస్యలు:డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా హైపర్ సోమ్నియాకు దారితీస్తాయి.
మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్: కొన్ని రకాల మందులు వాడుతున్నపుడు నిద్ర ఎక్కువగా ఉండొచ్చు. లేదా మందుల దుష్ఫ్రభావం వల్ల అలసటగా అనిపించి ఎక్కువ నిద్రకు కారణం అవుతాయి.
జీవన శైలి మరియు అలవాట్లు;
రాత్రి నిద్ర సరైన రీతిలో లేకపోవడం, రోజు ఒకే సమసయానికి నిద్రించలేకపోవడం, అసమతుల్య నిద్ర ప్యాటర్న్‌లు హైపర్ సోమ్నియాకు కారణం కావచ్చు.
శరీరానికి సరిపడా పోషకాలు అందకపోవడం కూడా అలసటకు హైపర్ సోమ్నియా కు కారణం అవుతుంది.
మద్యం, డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది, మాదక ద్రవ్యాల వినియోగం నిద్ర అవసరాన్ని పెంచుతుంది.
జెనెటిక్ కారణాలు: కొంత మంది కుటుంబ చరిత్రలో ఇలాంటి సమస్య ఉండి ఉండవచ్చు. జెనెటిక్ కారణాలతో కూడా హైపర్ సోమ్నియా సమస్య రావచ్చు.
హైపర్ సోమ్నియాకు సరైన కారణాలను తెలుసుకోవడానికి ముందుగా డాక్టర్ ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షల అనంతరం కారణాన్ని అనుసరించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రి నిద్ర పొయ్యే ప్యాటర్న్ సరిగా లేని వారు దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చెయ్యడం అవసరం.