Belly Fat: చీర కట్టుకుని ఫంక్షన్ వెళ్తే కామెంట్ చేస్తారని ఫీల్ అవుతున్నారా? అయితే ఇలా చేసి పొట్ట తగ్గించుకోండి
ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలంటే.. భయం.. ఎవరైనా పొట్ట చూస్తే.. ఏమంటారోనని. చీర కట్టాలంటే.. భయం పొట్ట కనిపిస్తే కామెంట్ చేస్తారని. మరి ఎలా?
పొట్ట పెరగడం అనేది ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రధాన సమస్య. బయటకు చెప్పరు గానీ.. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అతిగా పెరిగిన పొట్టను చూసుకుని ఎన్ని సార్లు తిట్టుకుని ఉంటారో కదా? తిట్టుకుంటే లాభం ఏంటీ కొన్ని పనులు చేస్తే.. తగ్గిపోతుంది. లేకుంటే ఫంక్షన్స్ కి వెళ్లాలన్నా.. నచ్చిన డ్రెస్ వేసుకోవాలన్నా.. చీర కట్టుకోవాలన్నా.. తెగ ఇబ్బంది పడిపోతుంటారు మరి.
Also Read: Himalayan Salt: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?
శారీరక శ్రమ లేకపోవడం, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో గంటల కొద్దీ కూర్చొని ఉండటం, ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల మహిళల్లో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావడానికి మీరేం చేయాలంటే... రోజూ ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. అరగంటైనా శారీరక శ్రమ చేయాలి. వారానికి మూడుసార్లు ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు, మిగతా రెండు రోజులు బరువులు ఎత్తే, శక్తినిచ్చే వ్యాయామాలను కచ్చితంగా చేయాలి. పొట్ట తగ్గడానికి సైక్లింగ్మం చి వ్యాయామం. సైక్లింగ్ వ్యాయామం 15 నుండి 20 నిమిషాలు చేయాలి.
Also Read: International Dog Day 2021: కుక్కతో మనిషికి ఎందుకంత ఫ్రెండ్ షిప్
Kolkata Chinese Kali Temple: ఈ దేవాలయంలో న్యూడిల్స్, సూప్ ప్రసాదం.. అసలు కథేంటంటే!
ఆహారం విషయానికి వస్తే చక్కెర, బెల్లం, స్వీట్స్, కేక్స్ లాంటి తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్ల వాడకం తగ్గించాలి. పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే పాలిష్ బియ్యం, అటుకులు తగ్గించాలి. వీటి స్థానంలో తాజా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. అన్నం మాత్రమే తినాలనుకుంటే తీసుకుంటున్న మొత్తాన్ని కాస్త తగ్గించి, ఆ స్థానంలో పప్పుదినుసులు, గుడ్డు, ఆకుకూరల వినియోగం పెంచాలి.
మీ ఆహారంలో ఒక పూట తృణధాన్యాలు వాడటం మొదలుపెట్టండి. మరోపూట పూర్తిగా పప్పుదినుసులతో మాత్రమే చేసిన పదార్థాలను తీసుకోండి. ఇలా మూడు నెలలపాటు చేస్తే మీ పొట్ట తగ్గుతుంది.
మధ్యాహ్నం భోజనంలో ఆ రోజు తీసుకునే కెలొరీల్లో దాదాపు 50 శాతం ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో జీర్ణవ్యవస్థ శక్తివంతంగా పనిచేస్తుంది. రాత్రి భోజనంలో తక్కువ కెలొరీలనిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి ఏడు గంటలలోపు డిన్నర్ అయిపోయేలా ప్లాన్ చేసుకోవాలి. శీతల పానీయాలు, స్వీట్లు, బ్రెడ్, పాస్తా, బిస్కట్లు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
Also Read: Prabhas New Look: ప్రభాస్ లుక్ చూసి అంతా షాక్.. ‘అంకుల్’ అంటూ నెటిజనులు ట్రోలింగ్