By: Haritha | Updated at : 05 Mar 2023 09:22 AM (IST)
జొవాన్న కాక్స్
ఒక మనిషి ఒకరోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే అది సాధారణం. అంతకుమించి నిద్రపోతే అతినిద్ర అంటారు. అలా కాకుండా రోజులో 22 గంటలు నిద్రపోతూనే ఉంటే అది రోగం కిందే లెక్క. ఆ రోగం బారిన పడి ఒక మహిళ తన జీవితంలో ఎక్కువకాలం పాటు నిద్రలోనే గడిపేస్తోంది. ఆమె పేరు జోవన్న కాక్స్. వయసు 38 ఏళ్లు. ఈమెకు ‘ఇడియోపతిక్ హైపర్ సోమ్నియా’ అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనివల్ల వారు ఎప్పుడూ నిద్రలోనే ఉంటారు. మెలకువగా ఉన్న కొద్ది సమయం కూడా అశాంతిగా, మనసంతా గందరగోళంగా ఉంటుంది. జొవన్నా ఓసారి ఏకంగా నాలుగు రోజులు పాటు నిద్రపోయింది.
జొవన్నా 2017లో ఈ వ్యాధి ఉన్నట్టు తెలిసింది. ఓ రోజు పగటిపూట పనిచేస్తున్నప్పుడే తీవ్రంగా అలసిపోయినట్లు అనిపించింది . విచిత్రమైన లక్షణాలు కనిపించాయి. బయటికి వెళ్తే క్లబ్బులు, కార్లలో... ఇలా ఎక్కడపడితే అక్కడ నిద్రపోవడం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆమె మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించింది. రెండు మూడేళ్ల పాటు ఎవరూ ఆమె రోగాన్ని నిర్ధారించలేకపోయారు. కేవలం ఈ నిద్ర కారణంగా 2019లో తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. చివరికి 2021లో స్లీప్ క్లినిక్ లో ఈమెకు ఉన్న అరుదైన నిద్ర రుగ్మత గురించి బయటపడింది. ఆమె మెలకువగా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండలేదు, భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. తన మంచం చుట్టూ సాలెపురుగులు పరిగెడుతున్నట్టు అనిపిస్తాయి.
అలాంటి ఆహారాలే...
జొవన్నా రోజులో మెలకువగా ఉండే సమయం చాలా తక్కువ. దీంతో ఆమె తన కోసం వంట చేసుకునే విధానాన్ని కూడా మార్చింది. ఆహార అలవాటులను మార్చుకుంది. ఏమైనా వండి తినాలి అంటే సమయం ఎక్కువ పడుతుంది. ఆ సమయంలో ఆమె నిద్రపోవచ్చు, అందుకే తనకు మెలకువ వచ్చినప్పుడే ప్రోటీన్ షేక్ లాంటివి తాగేస్తుంది. తన పరిస్థితి గురించి మాట్లాడుతూ ‘ఈ నిద్ర నా జీవితాన్ని నాశనం చేసింది. నేను నిద్రపోతే ఎప్పుడు లేస్తానో తెలియదు, ఏ పనీ చేయలేను. డ్రైవ్ చేయలేను. జీవించడం చాలా కష్టంగా మారింది. ఒంటరి అయిపోయాను, నాకు సాయం కావాలి’ అంటూ ఆమె దీనంగా అర్ధిస్తోంది.
ఆమె ఓ రోజు 12 గంటల పాటూ మెలకువగా ఉంది. గత ఆరేళ్లలో ఆమె పగటిపూట అత్యధికంగా మెలకువగా ఉన్న సమయం అదే. ప్రస్తుతం తన జీవితాన్ని సాధారణంగా మార్చే వైద్య సహాయం కోసం ఆమె వెతుకుతోంది.
Also read: దోశె సరిగా రావడం లేదా? అయితే ఈ ఆరు తప్పులు చేస్తున్నారేమో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి
Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం
Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే
Salt Side Effects: ఉప్పు ఎక్కువైతే ముప్పే - ఈ సూచనలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్!
అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు ఫ్రీ మెడికల్ క్యాంప్ - 10రోజుల పాటు
Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్ 30 వరకు ఛాన్స్
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?