News
News
వీడియోలు ఆటలు
X

Eyes and High BP: హై బీపీతో బాధపడుతున్నారా? అయితే మీ కళ్లు జాగ్రత్త

అధిక రక్తపోటు ఉన్న వారిలో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు వైద్యులు.

FOLLOW US: 
Share:

మధుమేహం, అధిక రక్తపోటు... ఈ రెండూ ప్రపంచంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. మనదేశంలో కూడా హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ రక్తపోటు వల్ల  రక్తనాళాలకు నష్టం కలగడంతో పాటు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణం అవుతుంది. అలాగే హైబీపీ వల్ల కళ్లకు కూడా సమస్య. కంటిలోని రెటీనాలో ఉండే సున్నితమైన రక్తనాళాలు అధిక రక్తపోటు వల్ల నష్టపోయే అవకాశం ఉంది. 

శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కళ్ళు కూడా ఒకటి. రక్తపోటు పెరిగినప్పుడు కంటికి ఆక్సిజన్‌ను, పోషకాలను సరఫరా చేసే సన్నని రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇలా దీర్ఘకాలం పాటు సాగితే కంటిచూపుకే ప్రమాదం. అందుకే హై బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నారు వైద్యులు. లేకుంటే రకరకాల కంటి సమస్యలు హైబీపీ కారణంగా వచ్చే అవకాశం ఉంది. హై బీపీ వల్ల కంటికి వచ్చే కొన్ని రకాల సమస్యలు ఇవిగో. 

రెటినోపతి 
ఇది రెటీనాలోని రక్తనాళాలు కంటి వెనుక భాగంలో ఉండే కాంతిని స్వీకరించే సెన్సిటివ్ కణజాలాలను దెబ్బతీసే పరిస్థితి. దీని వల్ల అంధత్వం వచ్చే అవకాశం కూడా ఎక్కువ. 

ఆప్టిక్ న్యూరోపతి 
అధిక రక్తపోటు వల్ల కంటి నుండి మెదడుకు దృశ్యమాన సమాచారాన్ని ప్రసారం చేసే ముఖ్యమైన ఆప్టిక్ నాడి కూడా దెబ్బతింటుంది. ఆప్టిక్ నరాలు దెబ్బతింటే కంటి చూపు మందగిస్తుంది.

హైపర్టెన్సివ్ రెటినోపతి
అధిక రక్తపోటు రెటీనాలోని రక్తనాళాల్లో ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. ఆ రక్తనాళాలు సంకోచించడం, రక్తస్రావం కావడం, వాపు రావడం వంటివి జరుగుతాయి. ఈ మార్పులు కంటి చూపు పై ప్రభావాన్ని చూపిస్తాయి. 

కేంద్ర దృష్టి ప్రభావితం అవుతుంది. దీని వల్ల చదవడం, డ్రైవ్ చేయడం, రోజువారి కార్యకలాపాలు చేయడం కష్టతరంగా మారుతుంది.

కంటి ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి
అధిక రక్తపోటు వల్ల కంటికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైబీపీ మాత్రలు రోజూ వేసుకోవాలి. కొంతమంది హైబీపీ కాస్త అదుపులోకి రాగానే వేసుకోవడం మానేస్తారు. ఇలా చేయడం వల్ల మళ్లీ బీపీ అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. 

అలాగే స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కంటిపై ఒత్తిడి, అలసట పడుతుంది. స్క్రీన్ ను దగ్గర నుంచి కాకుండా కొంచెం దూరం నుంచి చూడాలి.

సూర్యుడు నుంచి వచ్చే UV కిరణాలు కళ్ళకు హానికరం కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ తప్పకుండా ధరించండి.

తాజా పండ్లు, కూరగాయలు వంటివి కంటి ఆరోగ్యం కోసం తినాలి. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు నిండిన ఆహారం తినడం చాలా ముఖ్యం. అలాగే విటమిన్ A నిండిన ఆహారం కూడా కంటి ఆరోగ్యానికి కీలకం.

ధూమపానం చేసే అలవాటు ఉంటే మానేయండి. వీటివల్ల కంటి శుక్లాలు, ఆప్టిక్ నరాలు దెబ్బ తినడం వంటి సమస్యలు వస్తాయి.

Also read: మామిడి పండ్లను తినేముందు కాసేపు నీళ్లలో నానబెట్టాలా? అలా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 12 Apr 2023 11:42 AM (IST) Tags: High BP High blood pressure Eye Problems Eye Care

సంబంధిత కథనాలు

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్