అన్వేషించండి

Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

Rotator Cuff Injury: పవన్ కల్యాణ్ రొటేటర్ కఫ్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. భుజం కండరాలకు తగిలే ఈ గాయాలు ఎంత తీవ్రమైనవి? దీనికి కారణాలేంటి? సమస్యను ఎలా గుర్తించి జాగ్రత్త పడాలో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పవన్ కళ్యాణ్ భుజాలకు తీవ్ర రొటేటర్ కఫ్ గాయాలు, చికిత్స జరిగింది.
  • ప్రమాదాలు, వయసు, అధిక శ్రమతో కండరాలు దెబ్బతింటాయి, నొప్పి వస్తుంది.
  • భుజం నొప్పి, బలహీనత, కదలికలో ఇబ్బంది ప్రధాన లక్షణాలు.
  • క్రమం తప్పని వ్యాయామం, భంగిమ, విశ్రాంతి సమస్యను నివారిస్తాయి.

Rotator Cuff Injury: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. అందుకే ఆయనకు ముంబై వైద్యులు చికిత్స చేశారు. రెండింటికీ ఒకేసారి సర్జరీ చేస్తే ఇబ్బంది అవుతుందని మొదట కుడి భుజానికి చికిత్స చేశారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది. సమస్య ఉన్నట్టు ఎలా గుర్తించాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం. 

మనం భుజం కీలు అంటే షోల్డర్ జాయింట్‌ బంతి-గిన్నె అమరికను కలిగి ఉంటుంది. ఈ కీలు స్థిరంగా ఉండటానికి, చేయిని గుడ్రంగా తిప్పడానికి, పైకి ఎత్తడానికి వీలుగా ఉంటుంది. ఇలాంటి పనులు చేయడానికి ఈ అమరికతోపాటు నాలుగు ముఖ్యమైన కండరాలు, వాటి టెండన్స్‌ కూడా సహయం చేస్తుంటాయి. మొత్తం పార్టును రొటేటర్ కఫ్ అంటారు. ఈ కండరాలు దెబ్బతినడం , వాపు రావడం, లేదా చిట్లిపోవడమే రొటేటర్‌ కఫ్‌ ఇంజ్యూరీస్ అంటారు. 

అసలు ఈ రొటేటర్ కఫ్‌ గాయాలు ఎందుకు అవుతాయి?

ప్రమాదవశాత్తు కింది పడడం, చేయి చాచి బలంగా నేలకు గుద్దుకోవడం, బరువైన వస్తువులను ఆకస్మికంగా ఎత్తడం వల్ల కండరాలు ఒక్కసారిగా చిట్లిపోతాయి. పవన్ కల్యాణ్ విషయంలో ఆయన గతంలో చేసిన సినిమా స్టంట్లు, షూటింగ్‌లో జరిగిన ప్రమాదాలు ఇందుకు కారణం కావచ్చు. 

అంతేకాకుండా వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు బలం తగ్గుతుంది. దీంతో అవి బలహీనపడతాయి. దీనికి తోడు చేతులు పదే పదే పైకి ఎత్తే పనులు చేయడం కూడా కారణం కావచ్చు. స్పోర్ట్స్, పెయింటింగ్, చేతులు ఊపుతూ జనాల్లో ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. 

రొటేటర్ కఫ్ సమస్య ఉన్న వారిలో కనిపించే లక్షణాలు 

భుజం లోపలి భాగం మొద్దుబారినట్టు లేదా తీవ్రమైన నొప్పి ఉంటుంది. తల దువ్వుకోవడం, వెనకకు చేయి చాచడం, వస్తువులను అందుకోవడానికి చేయి పైకి ఎత్తినప్పుడు తీవ్రమన నొప్పి వస్తుంది. చేయి పైకి లేవదు. 

సమస్య ఉన్నవైపు భుజంపై పడుకున్నప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. నిద్ర కూడా పట్టదు. దెబ్బతిన్న చేత్తో కనీసం బరువులను కూడా ఎత్తలేకపోవడం, చేయి బలహీనంగా అనిపిస్తుంది. భుజాన్ని కదిలించినప్పుడు లోపల ఏదో అడ్డం పడుతున్టన్టు లేదా క్లిక్ అనే శబ్దాలు రావడం గమనించవచ్చు. 

రొటేటర్ కఫ్ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

క్రమం తప్పకుండా భుజం చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేసే స్ట్రెచింగ్, స్ట్రెంథెనింగ్ వ్యాయామాలు చేయాలి. కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు వంగిపోకుండా, భుజాలను వెనుకకు నిటారుగా ఉంచాలి. దీని వల్ల భుజం కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. జిమ్‌లో వర్కౌట్‌లు చేసేట్పుడు లేదా ఇంట్లో పనులు చేసేటప్పుడు భుజాలపై మోయలేని బరువులు వేయకూడు. చేతులను నిరంతరం పైకి ఎత్తి ఉంచే పనులు చేసే వారు మధ్య మధ్యలో భుజాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి.  నొప్పి చిన్నగా మొదలవుతున్నప్పుడే బరువులు ఎత్తడం ఆపేయాలి. తిగిన విశ్రాంతి ఇవ్వాలి. ఐస్‌ ప్యాక్ పెట్టాలి. నొప్పి తగ్గకపోతే ఆర్థోపెడిక్‌ వైద్యుడిని సంప్రదించాలి. 

Frequently Asked Questions

రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ అంటే ఏమిటి?

భుజం కీలు చుట్టూ ఉండే నాలుగు ముఖ్యమైన కండరాలు, వాటి టెండన్స్ దెబ్బతినడం, వాపు రావడం లేదా చిట్లిపోవడాన్ని రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ అంటారు. ఇవి చేయిని తిప్పడానికి సహాయపడతాయి.

రొటేటర్ కఫ్ గాయాలు ఎందుకు వస్తాయి?

ప్రమాదవశాత్తు కింద పడటం, బరువైన వస్తువులు ఆకస్మికంగా ఎత్తడం, వయసు పెరగడం వల్ల కండరాలు బలహీనపడటం లేదా పదే పదే చేతులు పైకి ఎత్తే పనులు చేయడం వల్ల ఈ గాయాలు వస్తాయి.

రొటేటర్ కఫ్ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఏమిటి?

భుజం లోపలి భాగంలో తీవ్రమైన నొప్పి, తల దువ్వడానికి లేదా చేయి పైకి ఎత్తడానికి కష్టపడటం, రాత్రి నొప్పి తీవ్రమవడం, చేయి బలహీనంగా అనిపించడం లక్షణాలు. భుజాన్ని కదిపినప్పుడు క్లిక్ శబ్దాలు కూడా రావచ్చు.

రొటేటర్ కఫ్ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

భుజం కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి, నిటారుగా కూర్చోవాలి. భుజాలపై ఎక్కువ బరువులు వేయకుండా చూసుకోవాలి, పనుల మధ్యలో విశ్రాంతి ఇవ్వాలి. నొప్పి మొదలైతే ఐస్ ప్యాక్ పెట్టి వైద్యుడిని సంప్రదించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget