అన్వేషించండి

పారానాయిడ్ పర్సనాలిటి డిజార్డర్ - ఇదొక అనుమానపు జబ్బు, చికిత్స కూడా ఉంది

కొందరు ప్రతిదానికి అనుమానిస్తుంటారు. దాన్ని వారి వ్యక్తిత్వం అనుకుంటాం గానీ అదొక జబ్బు.

భార్య తన భర్తను నిరంతరం అనుమానించడం లేక భర్త తన భార్యపై అనుమానాలు పెంచుకోవడం సమాజంలో చూస్తూనే ఉంటాం. వారిని అనుసరించడం, వాళ్ళ మొబైల్ ఫోన్లు, మెయిల్స్ చెక్ చేయడం... ఇలాంటి పనులు చేస్తూ జీవిత భాగస్వామిని అవమానిస్తూ ఉంటారు. వీటిని అతి జాగ్రత్తలుగా చెప్పుకుంటారు. నిజానికి అది జాగ్రత్త కాదు,  అనుమానపు జబ్బు. ఎదుటివారు ఎంత మంచిగా ఉన్నా కూడా వారు ఏదో తప్పు చేస్తున్నారని, తనను మోసం చేస్తున్నారన్న భావనతో ఉంటారు ఈ రోగం ఉన్నవారు. దీన్ని పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్జర్ అంటారు. ఈ జబ్బుతో బాధపడే అనుమాన పక్షులు సమాజంలో ఎంతో మంది ఉంటారు. కానీ అది మానసిక రుగ్మత అని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ. ఈ జబ్బుకు చికిత్స ఉందని ఎంతోమందికి తెలియదు.

 ఈ పారానాయిడ్ పర్సనాలిటీ డిసార్డర్‌ను షార్ట్ కట్లో PPD అని పిలుస్తారు మానసిక వైద్యులు. డిప్రెషన్ వంటివి కూడా మానసిక రుగ్మతలే కానీ PPD మాత్రం ఒక వ్యక్తిత్వ రుగ్మత. అనుమానించడం ఆ జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి  జీవితంలో ఒక భాగం. అతని వ్యక్తిత్వంలో ఒక భాగం. అతని మనస్తత్వంలో ఒక భాగం. అందుకే దీన్ని ఒక జబ్బుగా కూడా ఆ వ్యక్తి గుర్తించలేడు. తన అనుమానాలే నిజమని 100% నమ్ముతాడు. అలాంటి వ్యక్తికి కచ్చితంగా చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ అనుమానాల వల్లే ఎన్నో కుటుంబాలు కూలిపోయిన సందర్భాలు అధికం.

ఎందుకు వస్తుంది?
ఈ అనుమానపు జబ్బు ఎందుకు వస్తుంది? అనేది ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. అది వారసత్వంగా జన్యువుల ద్వారా వచ్చే అవకాశం ఉందని, అలాగే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వైద్యులు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన పిల్లలు, చిన్నప్పటి నుంచి అవమానాలకు, అనుమానాలకు, శారీరక, లైంగిక వేదనకు గురైన పిల్లలు, భావోద్వేగాలు అధికంగా ఉండే పిల్లలు, చాలా సెన్సిటివ్‌గా పెరిగిన పిల్లలు... పెద్దయ్యాక ఈ అనుమానపు జబ్బుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 

దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే?
తన చుట్టు ఉన్నవారు ఎంత బాగా చూస్తున్నా కూడా, వారంతా తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుంటారు ఈ రుగ్మతతో బాధపడుతున్న రోగులు. తల్లిని, తండ్రిని కూడా అనుమానిస్తారు. ఎవరిని నమ్మరు. స్నేహితులు, భార్యా, భర్తా... ఇలా ప్రతి వారిని అనుమానం గానే చూస్తారు. ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా తన భార్య లేదా భర్త తనకు ద్రోహం చేస్తున్నారని నిత్యం వేధిస్తుంటారు. తన అనుమానాలే సరైనవని చెప్పుకోవడానికి ఆధారాలు వెతికే పనిలో కూడా పడతారు. ఇలాంటి వాళ్లు ఎవరితోనూ ఏ బంధుత్వాన్ని నిలబెట్టుకోలేరు. చిన్న చిన్న విషయాలకే ఎదుటివారిపై తీవ్రంగా ఎగిరి పడతారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటారు. సరిగ్గా విశ్రాంతి తీసుకోలేరు. నిత్యం మానసిక ఒత్తిడితో ఉంటారు.

చికిత్స ఉందా?
ఈ మానసిక వ్యక్తిత్వ రుగ్మతకు చికిత్స ఉంది. కానీ దాన్ని తీసుకోవడానికి ఈ రోగం ఉన్నవారు ఎవరూ ముందుకు రారు. తమకు ఏ సమస్య లేదని, కావాలనే తనని ఏదో చేయడానికి చికిత్స పేరుతో తీసుకెళ్తున్నారని అనుమానిస్తారు. వారిని చికిత్సకు ఒప్పించడం చాలా కష్టం. కుటుంబ సభ్యులే ఏదో రకంగా ఒప్పించి చికిత్స ఇప్పించాలి. వీరికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరిపీ వంటి వాటి ద్వారా చికిత్స మొదలవుతుంది. సైకోథెరపీ కూడా చేస్తారు.ఈ సమస్యకు చాలా దీర్ఘకాలికంగా చికిత్స చేయడం అవసరం. ఆ ఓపిక కుటుంబ సభ్యులకు ఉండాలి. అంతేకాదు ఈ అనుమానపు జబ్బు ఉన్నవాళ్లు, తనకు చికిత్స అందిస్తున్న వైద్యులు, థెరపిస్టులను కూడా అనుమానిస్తారు. 

Also read: అనవసర భయాలతో రొయ్యలు తినడం మానేస్తున్నారా? అయితే మీకే నష్టం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills Bypoll 2025 Date:జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు మోగిన నగరా - పోలింగ్ సహా పూర్తి షెడ్యూల్ ఇదిగో !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు మోగిన నగరా - పోలింగ్ సహా పూర్తి షెడ్యూల్ ఇదిగో !
177 Crores Acre: ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
Nara Lokesh:  ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
HYDRA: చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది!హైడ్రాను ప్రశంసించిన హైకోర్టు న్యాయమూర్తి
చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది!హైడ్రాను ప్రశంసించిన హైకోర్టు న్యాయమూర్తి
Advertisement

వీడియోలు

Pakistan Fielding Women's ODI World Cup | ట్రోల్ అవుతున్న పాకిస్తాన్ ప్లేయర్స్
Kranti Goud India vs Pakistan ODI | బౌలింగ్ తో అదరగొట్టిన క్రాంతి గౌడ్
Ind vs Pak ODI Women's WC 2025 | పాకిస్తాన్‌పై భారత్ సూపర్ విక్టరీ
India vs Pakistan Shake Hand Controversy | వరల్డ్ కప్‌లోనూ ‘నో హ్యాండ్‌షేక్’
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills Bypoll 2025 Date:జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు మోగిన నగరా - పోలింగ్ సహా పూర్తి షెడ్యూల్ ఇదిగో !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు మోగిన నగరా - పోలింగ్ సహా పూర్తి షెడ్యూల్ ఇదిగో !
177 Crores Acre: ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
Nara Lokesh:  ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
HYDRA: చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది!హైడ్రాను ప్రశంసించిన హైకోర్టు న్యాయమూర్తి
చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది!హైడ్రాను ప్రశంసించిన హైకోర్టు న్యాయమూర్తి
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 29 రివ్యూ... ఇమ్యూనిటీ టాస్కులో ఫేవరిజంతో రచ్చ... మేల్ కంటెస్టెంట్స్‌ను కడిగిపారేసిన దివ్య, శ్రీజ... ఈ వారం నామినేషన్ల లిస్ట్
బిగ్‌బాస్ డే 29 రివ్యూ... ఇమ్యూనిటీ టాస్కులో ఫేవరిజంతో రచ్చ... మేల్ కంటెస్టెంట్స్‌ను కడిగిపారేసిన దివ్య, శ్రీజ... ఈ వారం నామినేషన్ల లిస్ట్
Visakhapatnam Crime News: కొడుకు వినడం లేదని, అప్పుచేసి మరీ రూ.3 లక్షల బైక్ కొనిస్తే.. కడుపుకోత మిగిల్చాడు..
కొడుకు అడిగాడని, అప్పుచేసి మరీ రూ.3 లక్షల బైక్ కొనిస్తే.. కడుపుకోత మిగిల్చాడు
YS Jagan: ఉద్యోగుల్ని ఇంత మోసం చేస్తారా ? - మేనిఫెస్టో చూపించి మరీ ప్రశ్నించిన జగన్
ఉద్యోగుల్ని ఇంత మోసం చేస్తారా ? - మేనిఫెస్టో చూపించి మరీ ప్రశ్నించిన జగన్
Supreme Court On Unclaimed Amount: క్లెయిమ్ చేయని నగదు రూ.3.5 లక్షల కోట్లు.. కేంద్రానికి, పలు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు
క్లెయిమ్ చేయని నగదు రూ.3.5 లక్షల కోట్లు.. కేంద్రానికి, పలు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు
Embed widget