Cancer tumours: రియల్ టైమ్‌లో క్యాన్సర్ కణాల ట్రాక్ - అందుబాటులోకి అత్యాధునిక యంత్రం - ఇక చికిత్స సులువే !
Cancer tumours tracking: దేశంలో పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులకు అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా క్యాన్సర కణాలను రియల్ టైమ్ లో ట్రాక్ చేసే యంత్రం కూడా వచ్చింది.

Tracks cancer tumours in real time: క్యాన్సర్ చికిత్సలో భారత్ అద్బుతమైన ముందుడుగు వేసింది. క్యాన్సర్ కణాలను రియల్-టైమ్‌లో ట్రాక్ చేసే మొట్టమొదటి అధునాతన క్యాన్సర్ చికిత్సా వ్యవస్థ భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. యశోద మెడిసిటీలో రియల్-టైమ్ MRIని రేడియేషన్ థెరపీతో కలిపి ఒక అధునాతన క్యాన్సర్ చికిత్సా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది వైద్యులు రోజువారీగా రేడియేషన్ మోతాదులను సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఎలెక్టా యూనిటీ MR లినాక్ అని పిలిచే ఈ యంత్రం, రియల్-టైమ్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI)ని ఖచ్చితమైన రేడియేషన్ థెరపీతో కలుపుతుంది. MRI స్కానర్ (ఇది శరీరం లోపలి స్పష్టమైన చిత్రాలను చూపిస్తుంది) , రేడియేషన్ యంత్రం (ఇది క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని చంపుతుంది). ఈ వ్యవస్థ రెండు ముఖ్యమైన లక్షణాలతో కలిపి ఉంటుంది.
ప్రస్తుతం ఘజియాబాద్‌లోని యశోద మెడిసిటీలో ఈ యంత్రాన్ని ఏర్పాుట చేశారు. చికిత్స సమయంలో స్వల్ప శరీర కదలికను కూడా ట్రాక్ చేయడం ద్వారా ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచే లక్షణం అయిన కాంప్రహెన్సివ్ మోషన్ మేనేజ్‌మెంట్ (CMM)ను కలిగి ఉంది. ఇలాంటిది దేశంలో మరెక్కడా లేదు. రోగి శరీరంలో వచ్చే మార్పుల ఆధారంగా రోజువారీగా రేడియేషన్ మోతాదులను వైద్యులు సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సాధారణ CT స్కాన్‌లకు బదులుగా MRIని ఉపయోగిస్తుంది కాబట్టి చాలా స్పష్టమైన చిత్రాలను ఇస్తుంది. రోగి శరీరం ఎలా స్పందిస్తుందో ఆధారంగా వైద్యులు ప్రతిరోజూ చికిత్స ప్రణాళికను ఈ యంత్రం ద్వారా వచ్చే ఫలితాలను బట్టి నిర్ణయించుకోవచ్చు.
ఈ ఎలెక్టా యూనిటీ MR లినాక్ చికిత్సను మరింత ఖచ్చితమైనదిగా, సురక్షితంగా , వేగవంతం మారుస్తుంది. చిన్న క్యాన్సర్ కణితులు ఉన్నవారికి , ఒకటి కంటే ఎక్కువసార్లు రేడియేషన్ అవసరమయ్యే వారికి ఈ యంత్రం ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చిన్న కణితులు ఈ యంత్రం హైపో-ఫ్రాక్షనేటెడ్ చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది. తక్కువ సెషన్‌లలో అధిక మోతాదులను ఇచ్చేలా చేస్తుంది. రోగులకు ఇబ్బందిలేకుండా ఉంటుంది.
క్యాన్సర్ వైద్యంలో ఇది కీలకమైన మార్పు అని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రేడియేషన్ సెషన్‌ను రియల్ టైమ్‌లో వ్యక్తిగతీకరించవచ్చు, ఫలితాలను మెరుగుపరుస్తుంది, దుష్ప్రభావాలను తగ్గిస్తుందని యశోద వైద్యులు చెబుతున్నారు.
At #YashodaMedicity, we offer next-gen #oncology care with Varian Edge & Ethos—advanced tech for high precision, safety & personalized #CancerCare.
— Yashoda Super Speciality Hospitals (@hospitalyashoda) April 22, 2025
For more details, visit: https://t.co/HvAhZGdbN4
#AdvancedCancerTreatmentIndia pic.twitter.com/G8yLoMTdd1
భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.4 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అందుకే క్యాన్సర్ వైద్యంలో విప్లవాత్మక మార్పులు అవసరం అని..అలాంటివి మార్పుల్ని ఈ MR లినాక్ ద్వారా సాధ్యమవుతుందని అంటున్నారు. ఎలెక్టా యూనిటీ MR లినాక్ భారతదేశంలో క్యాన్సర్ సంరక్షణకు కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేస్తుందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.





















