India Covid Update: దేశంలో కొత్తగా 34,403 కరోనా కేసులు నమోదు.. వ్యాక్సినేషన్‌తో మోదీకి ఆరోగ్యశాఖ గిఫ్ట్!
దేశంలో కొత్తగా 34 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు మొత్తం 77 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
దేశంలో కొత్తగా 34,403 కరోనా కేసులు నమోదుకాగా 320 మంది వైరస్‌తో మరణించారు. 37,950 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
India reports 34,403 new #COVID19 cases and 37,950 recoveries in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) September 17, 2021
Active cases: 3,39,056
Total recoveries: 3,25,98,424
77.24 crore vaccine doses administered so far. pic.twitter.com/tws6zntYQ7
- మొత్తం కేసులు: 3,33,81,728
- యాక్టివ్ కేసులు: 3,39,056
- మొత్తం రికవరీలు: 3,25,98,424
- మొత్తం మరణాలు: 4,44,248
- వ్యాక్సినేషన్: 77,24,25,744 (గత 24 గంటల్లో 63,97,972)
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 22,182 కేసులు కేరళలోనే వెలుగుచూశాయి. 178 మంది వైరస్ వల్ల మృతి చెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.65%గా ఉంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.02గా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.97 శాతంగా ఉంది. గత 84 రోజులుగా ఇది 3 శాతం కంటే తక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం. రోజువారీ పాజిటివిటీ రేటు 2.25%గా ఉంది.
పరీక్షల సామర్థ్యం..
గత 24 గంటల్లో 15,27,420 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 54.92 కోట్లకు పైనే కరోనా పరీక్షలు జరిగాయి.
మరో మైలురాయి..
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) September 17, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/Jlypfhw0VG pic.twitter.com/iBLXLdKpEw
#IndiaFightsCorona:#COVID19Vaccination Status (As on 17th September 2021, 8:00 AM)
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) September 17, 2021
✅Total vaccine doses administered (so far): 77,24,25,744
✅Vaccine doses administered (in last 24 hours): 63,97,972#We4Vaccine #LargestVaccinationDrive@ICMRDELHI @DBTIndia pic.twitter.com/TlDyYaMxSN
గత 24 గంటల్లో 63,97,972 వ్యాక్సిన్ డోసులు అందించారు. ఇప్పటివరకు మొత్తం 77.24 కోట్లకు పైనే టీకా డోసులు పంపిణీ చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. మోదీ పుట్టినరోజు నాడు ఈ 77 కోట్ల మైలురాయిని చేరుకోవడంపై ఆరోగ్య మంత్రి హర్షం వ్యక్తం చేశారు.