Covid 19 Cases India: దేశంలో 42 వేల కరోనా కేసులు నమోదు.. 308 మంది మృతి
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 42,766 కేసులు నమోదుకాగా 308 మంది మృతి చెందారు. కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.
దేశంలో మరోసారి రోజువారి కేసులు 40 వేలు దాటాయి. కొత్తగా 42,766 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
COVID19 | Of 42,766 new cases reported in India in the last 24 hours, Kerala recorded 29,682 COVID positive cases yesterday. The state also reported 142 deaths yesterday.
— ANI (@ANI) September 5, 2021
COVID19 | India reports 42,766 new cases in the last 24 hours, active caseload stands at 4,10,048 ; Recovery Rate currently at 97.42% pic.twitter.com/25mkPzJZJP
— ANI (@ANI) September 5, 2021
- కొత్త కేసులు: 42,766
- కొత్త మరణాలు: 308
- యాక్టివ్ కేసులు: 4,10,048
- రికవరీ రేటు: 97.42%
వ్యాక్సినేషన్..
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 66.89 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు, యూటీలకు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రాల వద్ద 4.37 టీకా డోసులు ఉన్నట్లు పేర్కొంది.
Also Read: Improve your Memory: వీటికి దూరంగా ఉండండి.. మెమొరీ పెంచుకోండి
కేరళ..
కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 29,682 కేసులు నమోదుకాగా 142 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 41,81,137కి చేరింది. మరణాల సంఖ్య 21,422కి పెరిగింది. పాజిటివ్ రేటు కాస్త తగ్గింది.
కొద్ది రోజులుగా కేరళలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో రోజువారి నమోదయ్యే కరోనా కేసుల్లో రెండొంతులు కేరళలోనే నమోదయ్యాయి. త్రిస్సూర్ జిల్లాలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. కొత్తగా 3,474 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులంలో 3,456, మలప్పురంలో 3,166 కేసులు వెలుగుచూశాయి. 25,910 మంది తాజా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 39,09,096 మంది వైరస్ నుంచి రికవరయ్యారు.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 4,130 కేసులు నమోదయ్యాయి. 64 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 64,82,117కి పెరిగింది. మరణాల సంఖ్య 1,37,707గా ఉంది. రికవరీ రేటు 97.02గా ఉంది.