Eyesight: గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? కళ్లు దెబ్బ తింటాయని భయపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ చిట్కాలు
మీరు కంటి సమస్యలకు దూరం అవ్వాలంటే... ఈ కింది విధంగా ట్రై చేసి చూడండి. మార్పును మీరే గమనిస్తారు.
వర్క్ ఫ్రం హోం(Work from home)తో ఎక్కువ మంది ఉద్యోగులు గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల ముందే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. కళ్లు మంటలు, కంటి చూపు తగ్గడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
కంప్యూటర్ల నుంచి వచ్చే హానికరమైన నీలి రంగు కాంతి మన కళ్లను దెబ్బతీస్తోంది. అంతేకాదు, ఎక్కువ సమయం కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల ముందు గడిపే వారు నిద్రలేమితో బాధపడుతున్నారు. మీరు కంటి సమస్యలకు దూరం అవ్వాలంటే... ఈ కింది విధంగా ట్రై చేసి చూడండి. మార్పును మీరే గమనిస్తారు.
బ్యాలెన్స్ డైట్: సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది,. విటమిన్లు, ఖనిజాలు, పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే కంటిచూపు మెరుగుపడడానికి దోహదపడుతుంది.
Exercise regularly: మన కంటి చూపును కాపాడటానికి వ్యాయామం(Exercise) సహాయపడుతుంది. వ్యాయామం చేయడం ద్వారా ఆక్సిజన్, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు కళ్లు పొడి బారకుండా చూస్తోంది.
Take breaks from screen time: 20 నిమిషాలకి ఒకసారి సిస్టమ్స్ నుంచి దూరంగా వెళ్లండి. కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడండి.
Don't smoke: పొగతాగడం అనేది అనారోగ్యానికి ఎంతో హాని. స్కోకింగ్ చేసే వాళ్లు కంటి సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి స్మోకింగ్‌కి దూరం అవ్వండి.
కెరోటినాయిడ్స్: కెరోటినాయిడ్స్(Carotenoids) ఆధారిత ఆహారాలను తీసుకోవడం వల్ల మన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు తరచుగా తీసుకోవడం వల్ల కళ్ల సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
రక్షణ కళ్లజోడు: ల్యాప్‌టాప్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరంతో పనిచేసేటప్పుడు రక్షణగా కళ్లజోడు(Protective goggles) ధరించడం మంచిది. దీనివల్ల హానికరమైన నీలి కాంతి నుండి మన కంటి చూపును కాపాడుకోగలం. బయటికి వెళ్లే సమయంలో కూడా సన్ గ్లాసెస్ ధరించడం వలన సూర్యుడి నుండి హానికరమైన UVA , UVB రేడియేషన్ల నుంచి కళ్ళను రక్షించవచ్చు.
ఈ పద్ధతులు పాటిస్తూ అనుమానం వస్తే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించండి. అంతేకాదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా వైద్యులతో పరిష్కరించుకోవడం మంచిది.