Alcohol Affects On Brain : మద్యం మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? న్యూరోసైంటిస్టులు ఏం చెబుతున్నారు?
Alcohol Affects On Brain : మద్యంపై న్యూరోసైంటిస్టుల తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మీరు తాగే ప్రతి చుక్కా ప్రమాదకరమే అని వార్నింగ్ ఇస్తున్నారు.

Alcohol Affects On Brain : మద్యం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా చాలా మంది ఫుల్‌గా తాగే వాళ్లు ఉంటారు. మరికొందరు వీకెండ్‌లో లేదా అకేషనల్‌గా తాగుతుంటారు. ఇలా దాదాపు 84 శాతం మంది ఏదో సందర్భంలో తాగుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. అతిగా తాగితేనే ప్రమాదమని మితంగా తాగితే చాలా ఫర్వాలేదని చాలా మంది భావిస్తుంటారు. మద్యం ఎంత తాగినా ప్రమాదమే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది పెరిగే కొద్దీ మరింత ప్రమాదమని వార్నింగ్ ఇస్తున్నారు.
మద్యం మెదడు, వెన్నుపాము, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంత తాగినా మెదడు కార్యాకలాపాలను నెమ్మదిస్తుంది. మగతకు కారణమవుతుంది. అదే మద్యం ఎక్కువ అయితే నాడీ కణాలను దెబ్బతీస్తుంది. వాటి మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను బ్రేక్ చేస్తాయి. ఇలా తరచూ తాగడం వల్ల కాలక్రమేణా జ్ఞాపకశక్తి, సమన్వయం, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
మద్యం తాగడం వల్ల వచ్చే సమస్యలను వైద్యులు రెండు రకాలుగా విభజిస్తున్నారు. మొదటిది తీవ్రమైన ప్రభావం కలిగించేవి. అకస్మాత్తుగా చూపించే ప్రభావం రెండోది. ఇలా తరచూ మద్యం తాగే వారికి బి1 విటమిన్ లోపం, కళ్లు కదలికలో గందరగోళం ఏర్పడుతుంది. ఇలాంటి వారికి చికిత్స చేయకుండా వదిలేస్తే కోర్సాకోఫ్ సైకోసిస్‌కు దారి తీస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి కోల్పోతారు. ఇవి లాంగ్‌రన్‌లో వచ్చే సమస్యలు. ఆల్కాహాల్ తాగడం వల్ల మూర్చపోవడం స్వల్పకాలంలో వచ్చే సమస్య. తిక్క తిక్కగా ప్రవర్తించడం, పిచ్చిపిచ్చిగా మాట్లాడటం, అవిశ్రాంతంగా ఉండటం తాత్కాలకంగా వచ్చే సమస్యలు.
Also Read: మద్యం మత్తులో ఏం చేశారో గుర్తులేదా? బ్లాక్అవుట్ వెనుక అసలు కారణం ఇదే!
ఎక్కువ కాలం నుంచి తాగుతున్న వారి నాడీ వ్యవస్థను క్రమ క్రమంగా దెబ్బ తింటుంది. నరాల బలహీనత ఏర్పడుతుంది. కాళ్లు చేతులు నొప్పి, తిమ్మిరి, బలహీనత ఏర్పడుతుంది. నడవడంలో, సమన్వయం చేస్తూ పని చేయడంలో వస్తువులు పట్టుకోవడంలో ఇబ్బంది పడతుంటారు. కండరాల ఫైబర్‌లను దెబ్బతీస్తుంది. క్రమంగా అవి బలహీన పడతాయి. కొన్ని సందర్భాల్లో సెరెబెల్లార్ క్షీణత కూడా ఏర్పడవచ్చు. దీని వల్ల చేసే పనిలో సమన్వయం ఉండదు. తూళిపోతుంటారు. వణుకుతుంటారు.
స్ట్రోక్, చిత్తవైక్యల్యానికి కారణం అవుతుంది. మార్కియాఫావా- బిగ్నామి వ్యాధి వస్తుంది. మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తాయి. వీటి వల్ల నడవడానికి ఇబ్బంది పడతారు. మాటలు అస్పష్టంగా ఉంటాయి. మతిమరుపు వస్తుంది. అనూహ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాటి నుంచి రక్షించుకోవడానికి మద్యానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మితంగా తాగినా నిద్ర, శ్రద్ధ, నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. తాత్కాలికంగా ఇలాంటి సమస్యలు ఉన్నా దీర్ఘకాలంలో నాడీ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
ఇప్పటికే మద్యం అలవాటు ఉన్న వాళ్లు తగ్గించడానికి ప్రయత్నించాలి. బీ1 విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోండి. కాళ్లు, చేతులు నొప్పులు, తిమ్మిరిగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. మద్యం తాగడంతో కొన్ని సమస్యల నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినా, దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మితంగా ఉండటం, పూర్తిగా మానేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ]





















