Nasal Congestion: ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం
Health Tips in Telugu | ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు.
Hemedies for nasal congestion | ముక్కు దిబ్బడ అనేది సాధారణమైన శ్వాస సమస్య, ఈ సమస్యతో చాలా అసౌకర్యం కలుగుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తో పాటు, నిద్రకు కూడా అంతరాయం కలిగిస్తుంది. సమస్య తీవ్రతను బట్టి రోజువారీ పనుల మీద కూడా ప్రభావం చూపుతుంది.
ఉప్పు నీటితో గార్గిల్ (సాలైన్ స్ప్రే)
ఉప్పు కలిపిన నీటిని ముక్కులో వేసుకోవడం ద్వారా ముక్కులో ఉండే తేమ పెరుగుతుంది. ఫలితంగా దిబ్బడ తగ్గుతుంది. ఉప్పు నీరు ముక్కులో ఉండే వ్యర్థాలను తొలగించి శ్వాసనాళాలను శుభ్రం చేస్తుంది. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి, ఆ ద్రావణాన్ని ముక్కులో తీసుకోవాలి.
వేప లేదా యూకలిప్టస్ నూనె
యూకలిప్టస్ ఆయిల్ లేదా వేపం ఆయిల్ తో ముక్కు దిబ్బడను తగ్గించుకోవచ్చు. ఈ నూనెలను ఆవిరి పట్టడం వల్ల శ్వాస నాళాల్లో ఉండే శ్లేష్మాన్ని కరిగించి, శ్వాస మార్గాలను సాఫీగా చేస్తాయి.
గోరువెచ్చని నీటిలో 2-3 చుక్కల యూకలిప్టస్ నూనె లేదా వేప నూనె వేయాలి. ఈ నీటి నుంచి వచ్చే ఆవిరిని దుప్పటి కప్పుకుని ముక్కు ద్వారా, నోటి ద్వారా పీల్చుకోవాలి.
ఆవిరి పట్టడం
ఆవిరి పట్టడం ద్వారా ముక్కులోని శ్లేష్మాన్ని సులభంగా కరిగించి, దిబ్బడను తగ్గించుకోవచ్చు.
ఒక పాత్రలో వేడి నీటి ఆవిరిని దుప్పటి కప్పుకుని శ్వాసగా తీసుకోవాలి. దీని వల్ల ముక్కులో ఉండే శ్లేష్మం (mucus) త్వరగా కరుగుతుంది.
గోరువెచ్చని నీరు తాగడం
వేడినీరు లేదా గోరువెచ్చని నీళ్లు లేదా ఇతర పానీయాలు తాగడం ద్వారా ముక్కులో ఏర్పడిన అదనపు శ్లేష్మాన్ని తగ్గించుకోవచ్చు. ఇది శరీరానికి తేమను అందించి శ్వాస మార్గాలను తెరిచి, ముక్కులో నెమ్మదిగా శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది.
తేనె మరియు అల్లం
అల్లం రసానికి తేనె కలిపి తీసుకుంటే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. అల్లం కషాయం వెచ్చగా తాగినా మంచి ఫలితం ఉంటుంది. అల్లం లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాస మార్గాలను సాఫీ చేస్తాయి.
ఒక టీ స్పూన్ అల్లం రసం మరియు ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
తేమపరిమాణం
ఇంటిలో గాలి తేమను నియంత్రించడానికి హ్యుమిడిఫైయర్ ఉపయోగించడం ద్వారా ముక్కులోని ఎండిపోయిన శ్లేష్మం తేమగా మారి దిబ్బడ తగ్గవచ్చు.
శీతోష్ణపరిమాణం క్రమంగా ఉంచడం
ముక్కులో దిబ్బడ సమయంలో చల్లటి గాలి లో ఎక్కువగా తిరగకూడదు. వెచ్చగా ఉండే పరిసరాల్లో ఉండడం ద్వారా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
తగినంత విశ్రాంతి
విష్రాంతి తీసుకోవడం శరీరానికి శక్తి సంతరించుకుని వ్యాధిని ఎదుర్కోవడానికి సమాయత్తం అవుతుంది. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం వలన ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది. శ్వాస సమస్యలను తట్టుకోవడానికి మెరుగైన సామర్థ్యం పొందుతుంది.
ముక్కు దిబ్బడ నివారణకు కొన్ని ముఖ్యమైన సూచనలు
అలర్జీకి కారణమయ్యే కారకాలు గమనించి వాటికి దూరంగా ఉండాలి.
పొగ మరియు గాలి కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో ఉండకపోవడం మంచిది.
ఇవి మీకు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ, ముక్కు దిబ్బడ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.