Restaurants Food: రెస్టారెంట్ల నుంచి మీరు తెచ్చుకునేది ఫుడ్ కాదు, క్యాన్సర్!
Restaurants Food: ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఇంటికి ఫుడ్ తెప్పించుకొని తినడం అలవాటుగా మారింది. కానీ ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా? రెస్టారెంట్స్ నుంచి వచ్చేది ఫుడ్ కాదు క్యాన్సర్ అంటే నమ్ముతారా?

Restaurant plastic container : ఇంట్లో వారంతా ఉద్యోగాలు చేస్తుండటమో లేదా బయట ఫుడ్‌పై వ్యామోహం కానీ చాలామంది వారంలో ఒకట్రెండు రోజులైనా ఇంట్లో వంట చేయడం లేదు. బయట నుంచి తెప్పించుకొని తింటున్నారు. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా బయట ఫుడ్ ఆర్డర్ చేయడం చాలా సాధారణం అయింది. పార్టీ అయినా, ఆఫీస్ మీటింగ్ అయినా లేదా ఇంట్లో గెస్ట్స్ వచ్చినా, వీకెండ్‌లో అయినా రెస్టారెంట్ల నుంచి టిఫిన్ లేదా ఫుడ్ డెలివరీ ట్రెండ్ వేగంగా పెరిగింది. ఇలా ఆర్డర్ చేసిన వెంటే రెస్టారెంట్ వాళ్లు క్షణాల్లో ప్యాక్ చేసి ఫుడ్ డెలవరీ యాప్ ద్వార పంపించేస్తున్నారు. ఇలా పంపించే లా హోటళ్లు, రెస్టారెంట్లు ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని ప్యాక్ చేసి ఇస్తున్నాయి. ఈ కంటైనర్లు చూడటానికి హైజనిక్‌గా సౌకర్యవంతంగా ఉంటాయి, కానీ వేడి ఆహారం వీటిలో ఉంచడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీయవచ్చని మీకు తెలుసా? ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం ఎంత ప్రమాదకరమో, దాని నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం.
ప్లాస్టిక్ కంటైనర్లు ఎలా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి?
బిస్ఫినాల్-A, ఫ్తాలేట్స్
చాలా ప్లాస్టిక్ కంటైనర్లు BPA వంటి రసాయనాలతో తయారవుతాయి. ఇవి ఎండోక్రైన్ డిస్‌రప్టర్లు, ఇవి శరీర హార్మోన్ వ్యవస్థలో అలజడి రేపుతాయి. వేడి ఆహారం లేదా కొవ్వు పదార్థాలు ఈ ప్లాస్టిక్ కంటైనర్లలో ఉంచినప్పుడు, ఈ రసాయనాలు ఆహారంలో కలిసిపోతాయి. ఇవి నెమ్మదిగా శరీరంలో పేరుకుపోయి క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత , అండకోశం వరకు ప్రభావం చూపుతాయి.
వేడి ఆహారం, ప్లాస్టిక్ ప్రతిచర్య
వేడి ఆహారం ప్లాస్టిక్‌తో ప్రతిస్పందించి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తుంది. ముఖ్యంగా మైక్రోవేవ్‌లో వేడి చేసిన ప్లాస్టిక్ కంటైనర్లు అత్యధిక నష్టాన్ని కలిగిస్తాయి.
తక్కువ-గ్రేడ్, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ఉపయోగం
చాలా చిన్న రెస్టారెంట్లు, డెలివరీ కంపెనీలు చౌకైన. తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నాయి, ఇది ఫుడ్-గ్రేడ్ కాదు. ఈ కంటైనర్ల నుంచి వెలువడే రసాయనాలు అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చు.
ఏ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది?
- క్యాన్సర్, ముఖ్యంగా బ్రెస్ట్, ప్రోస్టేట్, కోలన్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
- థైరాయిడ్, హార్మోన్ల గతి తప్పుతాయి.
- సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుదల
- గర్భిణీలు ఇలాంటి ఫుడ్ తింటే గర్భంలోని శిశువుకు ప్రమాదం
- కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం
- మెటబాలిక్ డిజార్డర్ , ఊబకాయం
ఎలా రక్షించుకోవాలి?
- ఆహారం ఆర్డర్ చేసినప్పుడు, రెస్టారెంట్ ఫుడ్-గ్రేడ్ కంటైనర్లు లేదా అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించమని చెప్పండి.
- ఆహారం ప్లాస్టిక్ కంటైనర్లో వచ్చినట్లయితే, దాన్ని వెంటనే గాజు లేదా స్టీల్ పాత్రలోకి తీసుకోండి.
- ప్లాస్టిక్ కంటైనర్లను మైక్రోవేవ్‌లో ఎప్పుడూ వేడి చేయవద్దు. దీని వల్ల రసాయనాలు నేరుగా ఆహారంలో కలిసిపోతాయి.
- చాలా మంది ఒకసారి వాడే ప్లాస్టిక్ కంటైనర్లను మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నారు, ఈ అలవాటును వదిలేయండి.
గమనిక: వార్తలో ఇచ్చిన సమాచారం సమాచారం కొన్ని మీడియా నివేదికల ఆధారంగా రాసింది. ఏదైనా సూచన అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.





















