అన్వేషించండి
Advertisement
NeoCoV Variant: నో టెన్షన్.. 'నియోకొవ్'కు అంతలేదట..! చైనా శాస్త్రవేత్తలే కాస్త మసాలా జోడించారట!
నియోకొవ్ వైరస్‌కు అంత భయపడాల్సిన పనిలేదని తాజాగా భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మనుషులకు వ్యాపించే అవకాశం చాలా తక్కువన్నారు.
ప్రపంచదేశాలు ఒమిక్రాన్ వేరియంట్ ధాటికి గజగజలాడుతోన్న వేళ నియోకొవ్ అనే కొత్త వేరియంట్ వార్తలు మరింత వణికిస్తున్నాయి. అయితే ఈ వేరియంట్ గురించి అంత భయపడాల్సిన పనిలేదని నిపుణులు తాజాగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న రూపంలో ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని, అయినా ఇది మెర్స్ కోవ్ అనే పాత వైరస్‌యేనని కొత్తదేం కాదని వివరించారు.
" 'నియో కోవ్' వైరస్.. గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్ - కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE2)ను ప్రభావవంతగా వాడుకొంటుంది. కానీ ఈ వైరస్ మనుషుల్లోని ACE2ను వాడుకోవడం కష్టం. కొత్త మ్యూటేషన్ వస్తే తప్ప అధి సాధ్యం కాదు. ఈ వైరస్ గురించి బయట వస్తోన్న వార్తలంతా ప్రచారం మాత్రమే. "
-డా. శంశాక్ జోషి, మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు
ఇప్పటివరకు లేదు..
దిల్లీకి చెందిన సీఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ ప్రధాన శాస్త్రవేత్త వినోద్ స్కారియా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నియోకొవ్ ఉన్న రూపంలో మనుషులపై ఏమాత్రం ప్రభావం చూపలేదన్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ మనుషులకు ఇంకా సోకలేదని గుర్తు చేశారు.
అందులోనూ ఏదైనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకడం చాలా అరుదైన అంశమన్నారు. అయితే ఇలాంటి వైరస్‌లపై దృష్టి సారించడం అవసరమన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
తెలంగాణ
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement