Cancers: వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తే... క్యాన్సర్ల ముప్పు నుంచి కాస్త తప్పించుకోవచ్చు
కనీసం రోజుకి 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మహిళలు పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉండొచ్చట.
ఇంట్లో మొత్తం పని చేస్తున్నాం... ఇంకా ప్రత్యేకంగా వ్యాయామం చేయాలా అని ఎంతో మంది మహిళలకు అనుమానం ఉండొచ్చు. కానీ, వైద్యులు ఏం చెబుతున్నారంటే... ఇంట్లో ఎంత పని చేసినా నడక లేదా వ్యాయామం చేయడమే మంచిదంటున్నారు. అందుకే కుదిరితే కనీసం రోజుకి 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మహిళలు పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉండొచ్చట. మహిళలకే కాదు ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది.
* ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడంతో పాటు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన 23 శాతం మలద్వార క్యాన్సర్లను నివారించుకోవచ్చని గుర్తించారు పరిశోధకులు.
* వారానికి 150 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ సమయం వ్యాయామం చేసే స్త్రీలకు గర్భాశయం వాల్స్‌లో తలెత్తే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పును 34శాతం తగ్గించవచ్చట.
* కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారినపడి చనిపోయి ఉంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా రొమ్ము క్యాన్సర్ గల మహిళలు 20 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదు సార్లు వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు పావు వంతు తగ్గుతుంది.
* ప్రతి రోజై ఒక మాదిరి వ్యాయామం చేసినా కూడా జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు నుంచి 50 శాతం వరకు తగ్గించుకోవచ్చు.
* ఆటలాడటం లేదా వినోదంతో కూడిన వ్యాయామాలు చేసే వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.
* బ్రిటన్‌లోని ఛారిటీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్... ప్రాథమిక దశలో క్యాన్సర్‌తో బాధపడుతున్న 50 మందిని ఎంపిక చేసి వారితో వారానికి రెండున్నర గంటల చొప్పున 12 నెలలపాటు వ్యాయామం చేయించింది. వారిలో గణనీయంగా క్యాన్సర్ తగ్గిపోయింది.
* వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెస్ట్, అండాశయం, సర్వికల్ క్యాన్సర్లను సులభంగానే ఎదుర్కోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
* బ్రోకలి తినండి: బ్రోకలి క్యాన్సర్‌ను నిరోధించడానికి ఎంతో సమర్థవంతంగా పని చేసే సూపర్ ఫుడ్స్‌లో ఒకటి. ఉడికించిన బ్రోకలి తరచూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* మద్యం, సిగరెట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. మంచి అలవాట్లతో వ్యాయామం చేస్తూ క్యాన్సర్ బారిన పడకుండా జీవించండి.