అన్వేషించండి

Mishri: వేసవిలో పటిక బెల్లం వాడితే శరీరానికి ఎంత చలవో తెలుసా?

ప్రతి ఇంట్లో పటిక బెల్లం ఉంటుంది. ముఖ్యంగా దేవుడికి ప్రసాదాలుగా దాన్నే ఉపయోగిస్తారు ఎక్కువమంది.

పటిక బెల్లాన్ని మిశ్రి లేదా ఇండియన్ రాక్ షుగర్ అని పిలుస్తారు. మన తెలుగిళ్లలో ఇది ఉండే అవకాశం ఎక్కువే. ఎందుకంటే దేవునికి ప్రసాదంగా ఎక్కువమంది దీన్నే నివేదిస్తూ ఉంటారు. పటిక బెల్లం అంటే మరేదో కాదు శుద్ధి చేయని చక్కెర. చెరుకు సిరప్‌తో తయారు చేసే పదార్థమే ఇది కూడా. అయితే చక్కెర, చెరుకు రసంతో పోలిస్తే పటిక బెల్లంలోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ.

సాధారణ చక్కెరకు బదులు పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల జీవక్రియకు మేలు కలుగుతుంది. వీటిలో ఇన్ఫ్లమేషన్‌తో పోరాడే ఖనిజాలు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఆరు రుచులతో కూడిన భోజనమే ఆరోగ్యకరమైనది. ఇందులో తీపి కూడా ఒక రుచి. ఆ తీపి రుచి కోసం చాలామంది రకరకాల స్వీట్లు తింటూ ఉంటారు. వాటికి బదులు  చిన్న ముక్క పటికబెల్లం తినడం మంచిది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరం నుంచి వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. 

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నప్పుడు ఈ పటిక బెల్లంతో రీఫ్రెష్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. పంచదారకు బదులు పటికి బెల్లాన్ని వేస్తే చాలు, ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరానికి ఎలక్ట్రోలైట్స్‌ను అందించి సమతుల్యం చేస్తుంది. మనసును రిలాక్స్‌గా ఉంచుతుంది.

జీర్ణ క్రియ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా పటిక బెల్లం ఎంతో సహాయపడుతుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం అయ్యేలా చేసి  జీర్ణం సక్రమంగా అయ్యేలా చేస్తుంది. 

ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు అవసరం. ఇవన్నీ కూడా పటిక బెల్లంలో ఉంటాయి.

దగ్గు, జలుబు వంటివి వేధిస్తున్నప్పుడు ఆయుర్వేదంలో పటికబెల్లం ఉపయోగించే ఔషధాలను తయారు చేస్తారు. ఎండుమిర్చి, నెయ్యి, పటిక బెల్లం పొడి కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించే శక్తి దీనికి ఉంది. పటిక బెల్లంలో గ్లైసిరైసిన్ అనే సమ్మేళనం ఉంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ.

పటిక బెల్లం నాడీ వ్యవస్థపై, నరాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది.  కాబట్టి రోజుకో చిన్న ముక్క పటిక బెల్లం తింటే అన్ని విధాలా మంచిది.

Also read: ముద్దు పెట్టుకుంటే వచ్చే వ్యాధి ఇది - దీనివి దాదాపు కోవిడ్ లక్షణాలే

Also read: డయాబెటిస్ రోగులకు ఉత్తమమైన పిండి రకాలు ఇవే, వీటి వల్ల రక్తంలో చక్కెర పెరగదు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Embed widget