ఈ ఇన్ఫెక్షన్ సైలెంట్ కిల్లర్ - సెప్సిస్ గురించి తెలియకపోతే ఎప్పటికైనా ప్రమాదమే!
సెప్సిస్ వల్ల కలిగే లక్షణాలు చాలా రకాల ఇతర అనారోగ్యాలను పోలి ఉండడం వల్ల ఇది సెప్సిస్ కావచ్చు అని అంచనాకు వచ్చే లోగా ఇన్ఫెక్షన్ తీవ్రమైపోయి ప్రాణాల మీదకు వస్తుంది.
బాక్సర్ మహమూద్ అలీ మరణానికి కారణం తెలుసా?
ముప్పెట్స్ క్రియేట్ చేసిన జిమ్ హెన్సన్ ఎలా మరణించారో ఐడియా ఉందా?
పోప్ జాన్ పాల్-II దైవసన్నిధి చేరిన కారణాలు ఏమిటనుకుంటున్నారు?
వీరంతా కూడా సెప్సిస్ ఇన్ఫెక్షన్ వల్లే మరణించారు. సెప్సిస్ సోకినపుడు కణజాలాలకు నష్టం జరుగుతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రమైనపుడు ఆర్గాన్ ఫెయిల్యూర్ ఒక్కోసారి మరణానికి కూడా కారణం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 49 మిలియన్ల మంది సెప్సిస్ బారిన పడుతున్నారని అంచనా. ఇది ఎవరికైనా రావచ్చు. ఎవరైనా ఈ సైలెంట్ కిల్లర్ వల్ల ప్రమాదంలో పడొచ్చు.
ఈ ఇన్ఫెక్షన్ కు వల్ల కలిగే లక్షణాలు చాలా రకాల ఇతర అనారోగ్యాలను పోలి ఉండడం వల్ల ఇది సెప్సిస్ కావచ్చు అని అంచనాకు వచ్చే లోగా ఇన్ఫెక్షన్ తీవ్రమైపోయి ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తారు. అంటే మనకు తెలియకుండానే అది నిశబ్దంగా ప్రాణాలు తీసేస్తుందని అర్థం. సెప్పిస్‌కు సంబంధించి ప్రతీ సంవత్సరం 1.7 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయట. ప్రతి రెండు నిమిషాలకు ఒక ప్రాణం ఈ ఇన్ఫెక్షన్ వల్ల గాల్లో కలుస్తోందని లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్య రొమ్ము క్యాన్సర్, డ్రగ్స్ ఓవర్ డోస్ అవడం, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి అనేక వ్యాధులన్నింటితో మరణించే వారికంటే పెద్ద సంఖ్యలో సెప్సిస్ మరణాలు నమోదు అవుతున్నాయట. దీన్ని పబ్లిక్ హెల్త్ క్రైసిస్ గా అభివర్ణిస్తున్నారు.
సెప్సిస్ ఏ వయసు వారికైనా రావచ్చు. అయితే ఇమ్యూనిటి బలంగా లేని పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు, డయాబెటిక్స్ వంటి వారిలోనే ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్ ను త్వరగా గుర్తించడం, వెంటనే అగ్రెసివ్ ట్రీట్మెంట్ ప్రారంభించడం ద్వారా సెప్సిస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రతను వీలైనంత త్వరగా తగ్గించడం వల్ల ప్రమాదం లేకుండా నివారించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సెప్సిస్ ను ఎదుర్కోవడం
- చేతుల శుభ్రత పాటించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల సెప్సిస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
- ఏ రకమైన ఇన్ఫెక్షన్ కైనా సరే సరైన చికిత్స తీసుకోవాలి.
- డాక్టర్లు సూచించిన పూర్తి డోసు మందులు లక్షణాలు తగ్గకపోయినా వాడాలి.
- సెప్సిస్ చికిత్సలో త్వరగా గుర్తించడం అనేది చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా గుర్తించి సరైన చికిత్స ప్రారంభించడం వల్ల ప్రాణాంతక స్థితి ఎదురవకుండా నివారించవచ్చు.
సెప్సిస్ లక్షణాలు
- బలహీనంగా అనిపించడం
- మానసిక స్థితిలో మార్పు, కన్ఫ్యూజన్, నిద్ర పోలేకపోవడం, లేవడానికి ఇబ్బంది
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పడుకుని ఉన్నపుడు శ్వాస ఆడకపోవడం
- గుండె దడగా ఉండడం, గుండె వేగం ఎక్కువగా ఉండడం
- జ్వరం, చలి, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స ప్రారంభించడం అవసరం.
సెప్పిస్ కు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే స్పందించి సమస్యను నిర్ధిరించుకుని చికిత్స ప్రారంభించడం ద్వారా ప్రాణాలకు ప్రమాదం తప్పించవచ్చు. కనుక సెప్సిస్ గురించిన అవగాహన కలిగి ఉండడం అవసరం. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తేవచ్చు.
Also Read: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.