అన్వేషించండి

Asthma: రాత్రివేళ ఆస్తమా రాకుండా అడ్డుకోవాలంటే ఇలా చేయండి

ఆస్తమా రోగులకు చల్లదనం చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రాత్రి ఆస్తమా దాడులు వచ్చే అవకాశం ఎక్కువ.

చాలామంది వ్యక్తులు రాత్రిపూట ఆస్తమా లక్షణాలను ఎక్కువగా అనుభవిస్తారు. కొందరిలో ఇది అధ్వానంగా మారే అవకాశం ఉంది. శ్వాస నాళాల చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుపోయి ఈ సమస్య వస్తుంది. దగ్గు ఆగకుండా వచ్చే ఛాన్సు ఉంది. రాత్రిపూట ఆస్తమా అటాక్ చేయకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా మందులను తీసుకోవాలి. 

1. రాత్రి పడుకోబోయే ముందు మీరు నిద్రించే స్థలాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఫ్యాన్లు, అల్మారాలు దుమ్ము పట్టి ఉండడం మంచిది కాదు. అవన్నీ కూడా మీకు ఆస్తమా వచ్చే అవకాశాన్ని రాత్రి పూట పెంచుతాయి. దుమ్ములో అలెర్జీ కారకాలు ఎక్కువ. 

2. మీరు వాడే తలగడలు, పరుపులు ఎప్పటికప్పుడు దుమ్ములేకుండా దులుపుకుంటూ ఉండండి. అలాగే డస్ట్ ప్రూఫ్ కవర్లను వాడడం మంచిది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్స్ వారు నిర్వహించిన అధ్యయనంలో బెడ్ రూమ్‌లో ఉన్న దుమ్ము పట్టిన బెడ్ షీట్లు, తలగడలు,  వాటి కవర్ల వల్లే ఎక్కువగా రాత్రిపూట ఆస్తమా వస్తున్నట్టు తేలింది. 

3. ఆస్తమా ఉన్నవారు తమ బెడ్ షీట్లను, పిల్లో కవర్లను ప్రతివారం వేడి నీటిలో ఉతికి ఆరేయడం మంచిది. దీని వల్ల దుమ్ములో ఉన్న సూక్ష్మక్రిములు కూడా మరణిస్తాయి.

4. చల్లని గాలి పొడిపొడిగా అనిపిస్తుంది. ఇది తీవ్రమైన ఆస్తమాకు కారణం అవుతుంది. కాబట్టి శీతాకాలంలో మీరు పడుకునే గదిలో హ్యుమడిఫైయర్ పెట్టుకోవడం మంచిది. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడం కూడా ఉత్తమం. హానికరమైన కణాలను ఇది ప్యూరిఫై చేస్తుంది.

5. పెంపుడు జంతువులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా రాత్రిపూట మీ పడకగదిలోకి పెంపుడు జంతువులను రానివ్వకండి. ఆ జంతువుల నుంచి రాలే బొచ్చు కూడా ఆస్తమాను పెంచేస్తుంది.

6. రాత్రి పడుకునే ముందు ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్లు, బలమైన వాసనలు వేసే క్యాండిల్స్ వంటివి వినియోగించవద్దు. ఉబ్బసం ఉన్నవారికి ఇవన్నీ చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఆస్తమాను ఎక్కువ చేస్తాయి. 

ఆస్తమా అనేది ఒక శ్వాసకోశ వ్యాధి. ఇది మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్ద వారిలో కూడా ఇది ఇబ్బంది పెట్టే సమస్య. ఈ వ్యాధి వల్ల శ్వాసనాళాలు సంకోచిస్తాయి. దీని వల్ల గాలి సరిగా ఆడదు. సిగరెట్, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువుల బొచ్చు, మానసిక ఆందోళన వంటి వాటి వల్ల ఆస్తమా పెరుగుతుంది. 

Also read: ఇనుప కళాయిలో ఈ కూరగాయలు వండకూడదు, వండితే ఏమవుతుందంటే

Also read: ప్రఖ్యాత GI ట్యాగ్ పొందిన బనారసి పాన్, కాశీ వెళ్లినవారు కచ్చితంగా తినాల్సిన కిళ్లీ ఇది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Tips to Manage Daily Stress : స్ట్రెస్ తగ్గించుకుని సంతోషంగా ఉండాలా? అయితే ఈ 5 చిట్కాలు తప్పక ఫాలో అవ్వండి
స్ట్రెస్ తగ్గించుకుని సంతోషంగా ఉండాలా? అయితే ఈ 5 చిట్కాలు తప్పక ఫాలో అవ్వండి
Heart Attack vs Cardiac Arrest : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
Ginger Turmeric Tea : వాతావరణం మారితే అల్లం-పసుపు టీ తాగండి.. మిరియాలు కూడా వేసి రోజూ తాగితే కలిగే లాభాలివే
వాతావరణం మారితే అల్లం-పసుపు టీ తాగండి.. మిరియాలు కూడా వేసి రోజూ తాగితే కలిగే లాభాలివే
Frequent Foot Swelling : పాదాల్లో పదే పదే వాపు వస్తోందా? ఈ ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు
పాదాల్లో పదే పదే వాపు వస్తోందా? ఈ ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget