Diabetes Control In Winter: డయాబెటిస్ ఉందా? చలికాలంలో ఈ 6 తప్పులు చేయొద్దు - చాలా ప్రమాదం
Diabetes Control In Winter: చలికాలంలో షుగర్ పేషంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, జీవనశైలి విషంయలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాలి. చిన్న పొరపాట్లే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను దిగజార్చుతాయి.
Diabetes Control In Winter : చలికాలం పలు రకాల ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. దీంతో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఇప్పటికే అనారోగ్యంబారిన పడినవారు శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆహారం, జీవనశైలి పరంగా కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాలి. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు రక్తలో గ్లూకోజ్ లెవల్స్ ను మరింత దిగజార్చుతాయి. కొన్ని రోజువారీ అలవాట్లు పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. అవేంటో చూద్దాం.
రక్తంలో చక్కెరను దిగజార్చే 6 రోజువారీ అలవాట్లు ఇవే:
1. సోమరితనం:
చలికాలం మనల్ని సోమరిగా మార్చుతుంది. రోజుకు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో బెడ్ పై నుంచి దిగాలంటేనే బద్దకంగా ఉంటుంది. దుప్పట్లో హాయిగా నిద్రించేలా చేస్తుంది. దీంతో ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం.. చలి కారణంగా వర్కౌట్స్ కు దూరంగా ఉండటం వల్ల రక్తప్రసరణ రేటు తగ్గుతుంది. దీంతో ఆక్సిజన్ సరఫరా నెమ్మదిస్తుంది. ఇది డయాబెటిస్ రీడింగ్ లను ప్రభావితం చేస్తుంది.
2. ప్రాసెస్డ్ ఫుడ్:
చాలా మందికి చలికాలంలో వేడి వేడి ఆహారం తినాలని ఉంటుంది. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ ను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మాంసం, క్యాన్డ్ ఫుడ్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్ శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ ను మరింత పెంచుతుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ప్రాసెస్డ్ ఫుడ్ తింటే వారిలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3. ఆలస్యంగా తినడం:
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి భోజనం చేయాలి..సమయానికి నిద్రించాలి. కానీ లేట్ లైట్ డిన్నర్లు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. రక్తంలో షుగర్ పెరిగేందుకు కారణం అవుతాయి. మాయో క్లినిక్ ప్రకారం ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో పేలవమైన గ్లైసెమిక్ నియంత్రణతో ముడిపడి ఉంటుందని పేర్కొంది.
4. ఒత్తిడి:
నేటికాలంలో బిజీలైఫ్ కారణంగా చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత సమస్యలు కావచ్చు లేదా వృత్తిపరమైనది కావచ్చు. చాలా మందిలో ఒత్తిడి అనేది విపరీతంగా పెరిగింది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక ఒత్తిడి రక్తంలో చక్కెర లెవల్స్ ను కూడా ప్రభావితం చేస్తుంది.
5. సమయానికి నిద్రలేకపోవడం:
ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వాలి. ఆరోగ్యకరమైన నిద్ర మనల్ని ఆరోగ్యవంతులను చేస్తుంది. నిద్రలేమి కారణంగా ఇన్సులిన్ ను పెరుగుతుంది. ఇది గ్లూకోస్ టాలరెన్స్ ను మరింత ప్రభావితం చేస్తుంది. అర్థరాత్రిళ్లు మెలుకువ ఉంటే ఆహారపు అలవాట్లకు అంతరాయం కలిగించి ఆకలి కోరికలను పెంచుతుంది.
6. ఆల్కహాల్, ధూమపానం:
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అంతేకాదు అధిక ఆల్కహాల్ సేవించే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేందుకు కారణం అవుతుంది. అధికమొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటే లివర్ చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా డేంజర్.
ఇవి సాధారణ విషయాలే అనిపించినప్పటికీ...ఏమాత్రం అశ్రద్ధ వహించినా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. మన జీవనశైలిలో చిన్న చిన్న అలవాట్లను మార్చుకున్నట్లయితే షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
Also Read : కొవిడ్ జెఎన్ 1 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. ఇలా సురక్షింతగా ఉండండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.