Walnuts: రోజుకు మూడు వాల్ నట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మధుమేహుల దగ్గర నుంచి గుండె జబ్బులు ఉన్న వాళ్ళ వరకు తీసుకోగలిగే అద్భుతమైన ఆహారం వాల్ నట్స్.
డ్రై ఫ్రూట్స్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది వాల్ నట్స్. గట్టి షెల్ లోపల మెదడు లాంటి నిర్మాణంగా విత్తనాలు కనిపిస్తాయి. ఈ విత్తనాలు నానబెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. మెదడు ఆరోగ్యానికి ఇది సూపర్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని శతాబ్దాలుగా ఇవి సంప్రదాయ ఆహారాల్లో ఒకటిగా నిలిచాయి. ఈ గింజల్లోని పోషకాలతో ఆరోగ్యం, శ్రేయస్సు, సంతోషం అన్ని లభిస్తాయి. అన్ని నట్స్ లో పోషకపరంగా కొవ్వులు అధికంగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వాటన్నింటిలో లభించే పోషకాలన్నీ ఒక వాల్ నట్ ద్వారా కూడా పొందవచ్చు.
గుండెకి మంచిది
వాల్ నట్స్ లో అన్ని గింజల కంటే అత్యధిక మొత్తంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి గుండెకి రక్షణగా నిలుస్తాయి. అవి తక్కువ ట్రైగ్లిజరైడ్‌లకు సహాయపడతాయి. ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. అమెరికన్ హర్ట్ అసోసియేషన్ ఈ మేరకు ధృవీకరించింది కూడా. ఒమేగా 3 కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల C-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) ని తగ్గించవచ్చని పరిశోధకులు తేల్చారు.
బరువు తగ్గిస్తుంది
కేలరీలు తక్కువగా ఉండే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నిర్వహణకి దోహదపడుతుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉన్న అనుభూతి ఉంటుంది. ప్రతిరోజు ఒక ఔన్స్ తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది.
బ్రెయిన్ బూస్టర్స్
వాల్ నట్స్ మెదడుకి సూపర్ ఫుడ్. ఇతర గింజలలో లేని వివిధ రకాల పాలీఫెనొలిక్ సమ్మేళనాలు ఇందులో లభిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇవి రెండు బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలని కలిగి ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి అనేది వృద్ధాప్యానికి ముఖ్యమైన కారకాల్లో ఒకటి. దీని వల్ల జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది. కానీ వాల్ నట్స్ తినడం వల్ల మతిమరుపు, అభిజ్ఞా క్షీణత వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది
వాల్ నట్స్ లో అధిక ALA ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది మంచి మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంది. పాలీఫెనొలిక్ వల్ల గట్ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మెదడు హ్యపీ హార్మోన్లు విడుదల చేసేలా ప్రేరేపిస్తుంది. వాల్‌నట్స్‌లో ట్రిప్టోఫాన్ కూడా పుష్కలంగా ఉంటుంది. డిప్రెషన్ నుంచి బయట పడేందుకు సహకరిస్తుంది.
క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది
వాల్ నట్స్ లో వై-టోకోఫెరోల్ ఉంటుంది. ఇది విటమిన్ ఇ తో సంబంధం కలిగి ఉంటుంది. క్యాన్సర్ కణాలతో సమర్థవంతంగా పోరాడుతుంది. రిచ్ ప్లాంట్ పాలీఫెనాల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా బలంగా పనిచేస్తుంది.
గట్ ఆరోగ్యం
మనం ఆరోగ్యంగా ఉండాలంటే గట్ ఆరోగ్యం బాగుండాలి. వాల్ నట్స్ తీసుకోవడం వల్ల గట్ లో మంచి బ్యాక్టీరియా ఏర్పడేందుకు సహకరిస్తాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. ప్రోబయోటిక్, బ్యూట్రిక్ యాసిడ్ ఉత్పత్తి చేసే సూక్ష్మజీవుల పెరుగుదలపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉన్నాయని కనుగొనబడింది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. గుండె, మధుమేహ నియంత్రణకి గట్ మంచి బ్యాక్టీరియా చాలా ముఖ్యం.
ఎన్నో పోషకాలు కలిగిన వీటిని రోజుకు 30-40 గ్రాములు తీసుకునేల చూడండి. లేదంటే వారానికి కనీసం 3 సార్లు తీసుకునేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: బామ్మ చెప్పిన చిట్కాలు - ఇంగువాతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు