News
News
X

Inguva: బామ్మ చెప్పిన చిట్కాలు - ఇంగువాతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇంగువ కూరలకి కమ్మని వాసన, రుచి ఇవ్వడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

FOLLOW US: 
Share:

దైనా అనారోగ్యం వచ్చిందంటే ఇప్పుడు వెంటనే మెడికల్ షాపుకి వెళ్ళి ఇంగ్లీషు మందులు తీసుకొచ్చి వేసుకుంటారు. కానీ గతంలో పరిస్థితి అలా ఉండేది కాదు. పెద్దలు చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటించారంటే ఎటువంటి అనారోగ్య సమస్య అయినా చిటికెలో నయం అయిపోతుంది. కడుపులో కాసింత ఇబ్బందిగా అనిపిస్తే అమ్మమ్మలు చెప్పే సలహా కాస్త ఇంగువ నీళ్ళు తాగమని. అది చాలా చక్కని రెమేడీ.

భారతీయులు తమ వంటకాల్లో తప్పకుండా ఇంగువ వేసుకుంటారు. దీన్నే హింగ్ లేదా ఆసఫోటిడా అని కూడా పిలుస్తారు. జీర్ణక్రియ ప్రక్రియని సులభతరం చేయడానికి ఇంగువ తప్పనిసరిగా వినియోగిస్తారు. ఇంగువలో అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. తీవ్రమైన మైగ్రేన్ నొప్పిని తగ్గించగలదు. పాము కాటు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇది కీటక వికర్షకంగా కూడా పని చేస్తుంది. ఇంగువ వల్ల ఉన్న ప్రయోజనాలు.

శిశువుల కడుపులోని గ్యాస్ తొలగిస్తుంది

పాలు తాగే శిశువుల్లో గ్యాస్ చేరి పొట్ట ఇబ్బంది పెడుతుంది. నోరు తెరిచి చెప్పలేక ఏడుస్తూ ఉంటారు. మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే పిల్లలకి పొట్ట మీద ఇంగువ నీళ్ళు రాస్తారు. ఇలా చేయడం వల్ల గ్యాస్ నుంచి తక్షణమే ఉపశమనం పొందుతారు. హాయిగా నిద్రపోతారు. ఒకటి లేదా రెండు స్పూన్ల గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ మిక్స్ చేసి యాంటీ క్లాక్ వైజ్ మోషన్ లో శిశువు పొట్ట మీద అప్లై చేయాలి. ఇది వాళ్ళకి మంచి రిలీఫ్ ఇస్తుంది.

శ్వాసకోశ రుగ్మతలు నయం చేస్తుంది

ఇంగువలో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయి. ఉబ్బసం, పొడి దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలని చికిత్స చేయడానికి సహాయపడుతుంది. జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందటానికి 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి, 2 టేబుల్ స్పూన్ల శొంఠి తీసుకుని తేనె వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2-3 సార్లు తీసుకుంటే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పంటి నొప్పి తగ్గిస్తుంది

పుచ్చిన పన్ను నొప్పిగా ఉన్నప్పుడు ఇంగువ పెట్టుకుంటే కాసేపటికే రిలీఫ్ వస్తుంది. నొప్పిగా ఉన్న పన్ను పక్కన చిగుళ్ళపై కొద్దిగా ఇంగువ ఉంచుకుంటే సరిపోతుంది. నొప్పి తగ్గే వరకు రోజుకు 2-3 సార్లు ఈ రెమిడీ అనుసరించవచ్చు.

తలనొప్పి మటుమాయం

తలనొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1-2 కప్పున నీటిని తీసుకుని బాగా వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా ఇంగువ వేసి 10-15 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ నీటిని రోజంతా తాగుతూ ఉండాలి. తీవ్రమైన తల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి, కర్పూరం, మిరియాలు సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఈ పొడులన్నింటిని రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. మైగ్రేన్ నుంచి తక్షణ ఉపశమనం పొందేందుకు ఈ పేస్ట్ ని కనుబొమ్మల మధ్య రాసుకుని ఉంచుకుంటే చక్కని ఫలితం పొందుతారు.

నపుంసకత్వానికి చికిత్స

పురుషులలో నపుంసకత్వాన్ని నయం చేయగల సామర్థ్యం ఇంగువకి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. చిటికెడు ఇంగువ నెయ్యిలో వేసి వేయించాలి. అందులో 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ మర్రి చెట్టు రబ్బరు పాలు కలపాలి. నపుంసకత్వానికి చికిత్స చేయడానికి ఈ మిశ్రమాన్ని సూర్యోదయానికి ముందు 40 రోజులు క్రమం తప్పకుండా తినాలి.

పాము కాటు నుంచి రక్షిస్తుంది

విషపూరిత కీటకాలు, పాము కాటు నుంచి రక్షించడంలో కూడా ఇంగువ సహాయపడుతుంది. ఈ పౌడర్ ని నీళ్ళతో కలిపి పాము కాటు వేసిన చోట అప్లై చేయాలి. ఆరిపోయిన తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: చలికాలంలో చర్మం పొడిబారిపోతుందా? ఈ బాడీ వాష్ ట్రై చేయండి

Published at : 05 Jan 2023 03:37 PM (IST) Tags: Home Remedies Inguva Heeng Heeng Benefits Grandma Hacks Snake Bite Remedie Headache Remedies

సంబంధిత కథనాలు

Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే -  ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు

Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే - ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు

Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!

Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత

రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

టాప్ స్టోరీస్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?