Covid Update: భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 58 వేల మందికి వైరస్
Covid Update: దేశంలో కొత్తగా 58,077 కరోనా కేసులు నమోదయ్యాయి. 657 మంది కరోనాతో మృతి చెందారు.
Covid Update: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 58,077 కరోనా కేసులు నమోదయ్యాయి. 657 మంది మృతి చెందారు. 1,50,407 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 3.89%కి పడిపోయింది.</p
- యాక్టివ్ కేసులు: 6,97,802 (1.64%)
- డైలీ పాజిటివిటీ రేటు: 3.89%
- మొత్తం వ్యాక్సినేషన్: 1,71,79,51,432
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 48,18,867 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,71,79,51,432 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అలర్ట్‌గా ఉండాలి
దేశంలో ఇదివరకుతో పోలిస్తే పరిస్థితి మెరుగైందని కేంద్ర పేర్కొంది. జనవరి 24న దేశంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని ఇప్పుడు 4.44 శాతానికి చేరిందని తెలిపింది.
భారత్‌లో కరోనా స్థితిపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించింది. మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా వైరస్‌పై పూర్తి అవగాహన లేనందున అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
కొవిడ్ వ్యాప్తి కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల్లో ఇంకా ఆందోళనకరంగానే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 40కు పైగా జిల్లాల్లో ఇంకా వీక్లీ కేసుల్లో పెరుగుదల కొనసాగుతోందని పేర్కొంది. ప్రస్తుతం 141 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని.. 5-10 శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 160గా ఉందని వెల్లడించింది.
Also Read: SC on Hijab Row: 'హిజాబ్'పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్- విచారణకు సుప్రీం నో