Covaxin BBV152 booster: గుడ్ న్యూస్.. దేశమా ఊపిరి పీల్చుకో.. కొవాగ్జిన్ బూస్టర్‌తో ఒమిక్రాన్‌కు చెక్!
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ బూస్టర్ డోస్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది.

కరోనా, ఒమిక్రాన్‌తో బెంబేలెత్తిపోతోన్న ప్రజలకు భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రానున్న కొవాగ్జిన్ బూస్టర్ డోస్ (BBV152) ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది.
బూస్టర్ డోసుతో డెల్టాతో పాటు ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేలా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని సంస్థ పేర్కొంది. అమెరికాకు చెందిన ఎమోరి కేంద్రంలో బూస్టర్ డోసు తీసుకున్నవారి సెరాను ఒమిక్రాన్ లైవ్ వైరస్‌తో కలిపి పరిశోధనలు చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
ఈ పరిశోధనలో డెల్టా సోకినవారిలో 100 శాతం యాంటీబాడీలు, ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని వెల్లడించింది. దీంతో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు రెండింటిని కొవాగ్జిన్ బూస్టర్ డోసు అడ్డుకోగలదని తేలిందని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.
కరోనా కేసులు..
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజువారి కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. కొత్తగా 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. 442 మంది వైరస్‌తో మృతి చెందారు. 60,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,46,30,536కు పెరిగింది.
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి పెరిగింది. ఇందులో 1805 మంది రికవరయ్యారు.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

