అన్వేషించండి

Covid 19 Vaccine: రెండు డోసులు టీకా వేసుకున్నారా? కానీ బూస్టర్ డోసు తప్పదట!

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు కొన్ని నెలలకే క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. అయితే వ్యాక్సిన్‌ల వల్ల ఎంతకాలం రక్షణ ఉంటుందనే అంశంపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. వీటిపై అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నా.. వాటినుంచి కలిగే రక్షణ కొన్ని నెలలకే క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

పురుషులపై..

ఈ అధ్యయన ఫలితాల ప్రకారం మహిళల కంటే పురుషుల్లోనే టీకా రక్షణ తక్కువ ఉంటున్నట్లు తేలింది. దీంతో బూస్టర్‌ డోసుల ఆవశ్యకతపై పలు దేశాలు చేస్తోన్న ప్రకటనలకు ఈ అధ్యయనాలు బలం ఇస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లో  5 వేల మంది ఆరోగ్య కార్యకర్తలపై ఓ అధ్యయనం చేశారు. వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత వీరిలో కరోనా నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు క్రమంగా క్షీణిస్తున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైంది. 

మరిన్ని పరిశీలనలు..

  • ఆరోగ్యవంతులతో పోలిస్తే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కొవిడ్ యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తున్నాయి.
  • చిన్న వయసు వారి కంటే వృద్ధుల్లో యాంటీబాడీలు వేగంగా తగ్గిపోతున్నాయి.
  • టీకా వల్ల వృద్ధి చెందే యాంటీబాడీలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు, కనిష్ఠ స్థాయికి తగ్గిపోయినపుడు పరిశీలిస్తే మహిళల్లో కంటే పురుషుల్లోనే వీటి సంఖ్య తక్కువగా ఉంది.

ఫైజర్‌ వ్యాక్సిన్‌లు ఇచ్చే రక్షణపై ఈ మధ్యే కతర్‌లోనూ అధ్యయనం చేశారు. రెండో డోసు తీసుకున్న తొలి నెలలో యాంటిబాడీలు 77.5 శాతం రక్షణ కల్పించగా ఐదు నుంచి ఏడు నెలల్లోనే ఇవి 20 శాతానికి పడిపోయినట్లు వెల్లడైంది. 

భారత్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని.. పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ వచ్చే ఏడాది మొదట్లోనే థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని సర్వేలు వస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు కోరుతున్నప్పటికీ ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. చాలా మంది కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. 

Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేష‌న్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

Also Read: PM Modi 20 Years: మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget