Omicron Variant BA.4 in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్ - కొత్త ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు ఇక్కడే !
ఒమిక్రాన్ వైరస్ వేరియంట్లలో ఒకటైన బీఏ.4 దేశంలో మొదటి సారిగా హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఆ వ్యక్తి ఈ వైరస్‌లో ఇండియాకు వచ్చి కొన్నాళ్లు ఉండి మళ్లీ ఆఫ్రికాకు వెళ్లిపోయాడు. ఇప్పడు అది ఎంత మందికి సోకిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Omicron Variant BA.4 in Hyderabad: ఒమిక్రాన్‌కి చెందిన సబ్ వేరియంట్ బిఎ 4 తొలి కేసు హైదరాబాద్‌లో నమోదైంది. దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 కేసుగా తెలుస్తోంది. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌కి రాగా.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జరిపిన వైద్య పరీక్షల్లో అతడికి ఈ సబ్ వేరియంట్ సోకినట్టు గుర్తించారు. అతడికి లక్షణాలు లేకపోవడంతో తిరిగి ఈనెల 16వ తేదీనే అతడు ఆఫ్రికా వెళ్లిపోయాడు. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తించినది ఒమిక్రాన్‌కి సబ్ వేరియంట్ బిఎ 4 అవునో కాదో అనే విషయం నిర్ధారించుకునేందుకు అతడి శాంపిల్స్‌ని ఇండియన్ సార్స్-కొవిడ్ 2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ (ఇన్సాకోగ్)కి పంపించారు. ప్రస్తుతం కన్సార్టియం నుంచి నివేదిక రావాల్సి ఉంది.
దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి
కన్సార్టియం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఈ సబ్‌వేరియంట్ కేసుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనిషిలోని రోగనిరోధక శక్తిని చీల్చుకుంటూ వెళ్లడం, ఇంతకు ముందు వైరస్ వచ్చి నయం అయిన వారికి కూడా ఇది సోకడం, పైగా కొవిడ్ నిరోధక పలు దశల వ్యాక్సిన్లు పొందిన వారిలో కూడా ఇది సంక్రమించే ప్రమాదం ఉంది. ఈ విధంగా దీని మూలకణాలు అత్యంత శక్తివంతంగా ఉన్నాయని నిపుణులు తేల్చారు. కొవిడ్ 19 జీనోమ్ కదలికలు స్వరూపాల పర్యవేక్షణ కార్యక్రమం దశలో హైదరాబాద్‌లో ఈ కొత్త రకం వేరియంటు ఉనికి ఉన్నట్లు గుర్తించారు . ఆఫ్రికా నుంచి వచ్చిన సదరు వ్యక్తితో కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రభుత్వ సొంత "ఓటీటీ" - ఇక సినిమాలన్నీ అందులోనేనా ?
ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ4 కేసు (Omicron Variants) గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో బిఎ . 2 సబ్‌వేరియంటు పెను ముప్పు తెచ్చిపెట్టింది. ఇప్పుడు హైదరాబాద్‌లో బయట పడినట్లుగా చెబుతున్న బిఎ 4 సబ్‌వేరియంటు తొలుత బిఎ 5 ఉప ఉపరకంతో పాటు ఈ ఏడాది జనవరిలోనే దక్షిణాఫ్రికాలో గుర్తించారు. అప్పుడు ఇండియాలో ధర్డ్‌వేవ్ దశ ఉంది. బిఎ 4 ఒమిక్రాన్‌తో పోలిస్తే తక్కువ తీవ్రతతోనే ఉంటుంది. కానీ ఎక్కువగా సంక్రమించే రకం అని నిపుణులు చెబుతున్నారు.
శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపుపై పిటిషన్- విచారణకు కోర్టు ఓకే