India Covid Cases: దేశంలో తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు.. 184 రోజుల్లో ఇదే అత్యల్పం..
India Corona Cases: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 26,115 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 184 రోజులుగా నమోదవుతోన్న కోవిడ్ కేసుల్లో ఇవే అత్యల్పం కావడం విశేషం.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,115 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 184 రోజులుగా నమోదవుతోన్న కోవిడ్ కేసుల్లో ఇవే అత్యల్పం కావడం విశేషం. కొత్తగా నమోదైన వాటితో కలిపి దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,35,04,534కి చేరింది. దేశంలో నిన్న ఒక్క రోజే కోవిడ్ బారిన పడిన వారిలో 34,469 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,27,49,574కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా కారణంగా 252 మంది మరణించారు. దీంతో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,45,385కి పెరిగింది.
దేశంలో ఈరోజు నమోదైన కోవిడ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం, క్రియాశీల కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో 3,09,575 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 97.75 శాతానికి పెరగగా.. క్రియాశీల రేటు 0.92 శాతానికి తగ్గింది. కేరళలో నిన్న ఒక్క రోజే 15,692 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81,85,13,827 మందికి కోవిడ్ టీకాలు అందించారు. నిన్న ఒక రోజే 96,46,778 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశంలో ఇప్పటివరకు 55,50,35,717 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 14,13,951 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
India reports 26,115 new #COVID19 cases, 252 deaths & 34,469 recoveries in last 24 hrs, says Health Ministry
— ANI (@ANI) September 21, 2021
Total Cases: 3,35,04,534
Total Active cases: 3,09,575
Total Recoveries: 3,27,49,574
Total Death toll: 4,45,385
Total vaccination: 81,85,13,827 (96,46,778 in 24 hrs) pic.twitter.com/CzL8Ugj7lq
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/YYv51yKYwO
— ICMR (@ICMRDELHI) September 21, 2021
Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు