By: ABP Desam | Updated at : 21 Apr 2022 08:54 PM (IST)
Edited By: Murali Krishna
ఐఐటీ మద్రాస్‌లో కరోనా కలకలం
దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని ఐఐటీ మద్రాస్‌లో 12 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ పెరుగుతుండటంతో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు. తమిళనాడులో బుధవారం కొత్తగా 31 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ జాగ్రత్తలను సీరియస్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు.
దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మళ్లీ మాస్కు వినియోగం తప్పనిసరి చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా నివారణకు ఫేస్ మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని చండీగఢ్, హరియాణా, పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు తెలిపాయి.
దేశంలో
దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే పెరిగింది. ఈ రోజు మరో 2,380 కరనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా కొత్తగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,231 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30 లక్షల 49 వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.53 శాతానికి పెరిగింది.
Also Read: Liver Disease Cases In US, Europe: పిల్లల్లో అంతుచిక్కని వ్యాధి- ఇలా సోకితే అలా కుప్పకూలుతున్నారు!
Omicron Variant BA.4 in Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్ - కొత్త ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు ఇక్కడే !
Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!