Covid 19 Update India: భారీగా తగ్గిన కరోనా కేసులు, 154 రోజుల కనిష్టానికి కొవిడ్ కేసులు.. 97.5 శాతానికి చేరిన రికవరీ రేటు
దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో ఏకంగా 154 రోజుల కనిష్టానికి తాజా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్19 మరణాలు మాత్రం తగ్గడం లేదు.
ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నా.. మహమ్మారి ప్రభావం గత కొన్ని రోజులుగా తగ్గుతోంది. ప్రమాదకర డెల్టా ప్లస్ వేరియంట్ మరణాలు సైతం నమోదవుతున్నా పలు రాష్ట్రాలు సమర్థవంతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 15 లక్షల 63 వేల 985 శాంపిల్స్‌కు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 25166 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. కాగా ఇది గత 154 రోజులలో నమోదైన అతి తక్కువ కొవిడ్19 కేసులు ఇవి. నిన్నటితో పోల్చితే దాదాపు 7 వేల వరకు పాజిటివ్ కేసులు తగ్గాయి.
అదే సమయంలో మరో 437 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,32,079 (4 లక్షల 32 వేల 079)కు చేరుకుంది. వరుసగా మూడోరోజు కరోనా పాజిటివ్ కేసుల కంటే కొవిడ్19 నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నిన్న ఒక్కరోజులో 36,830 మంది కరోనా మహమ్మారని జయించారు. తాజు రికవరీలతో కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 3,14,48,754 (3 కోట్ల 14 లక్షల 48 వేల 754)కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 146 రోజుల కనిస్టానికి చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 3,69,846 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 97.5 శాతానికి చేరుకుందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
Also Read: Diabetes: మధుమేహాన్ని నియంత్రించడంలో ఇదే మంచి ఫుడ్ అంటున్న అధ్యయనాలు, ఆరోగ్యనిపుణులు
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
దేశంలో కరోనా టీకాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవగాహణతో ప్రజలు వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా నిన్నటివరకూ మొత్తం 56,81,32,750 (56 కోట్ల 81 లక్షల 32 వేల 750) డోసుల కరోనా టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. ఇందులో ఇంకా 2.25 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద నిల్వ ఉన్నాయని తాజా బులెటిన్‌లో తెలిపారు.
Also Read: Pregnancy tips: పిల్లలు పుట్టడం లేదా? ఇలా చేస్తే.. తప్పకుండా గుడ్ న్యూస్ వింటారు!