Diabetes: మధుమేహాన్ని నియంత్రించడంలో ఇదే మంచి ఫుడ్ అంటున్న అధ్యయనాలు, ఆరోగ్యనిపుణులు
తృణధాన్యాల (మిల్లెట్స్)తో మధుమేహం మాయమవుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారు తమ ఆహారంలో తృణధాన్యాలను చేర్చడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా చూసుకోవచ్చన్నారు నిపుణులు.
నిత్యం తీసుకునే ఆహారం…బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నప్పుడు ఏం తినాలో, ఏ తినకూడదో గుర్తించడం కొంత గందరగోళంగా ఉంటుంది. డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలపై మీరు తీసుకునే ప్రతి ఆహారం, పానీయం ప్రభావం ఏ స్థాయిలో పడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ఎన్నో ఆహారాలున్నాయి.మిల్లెట్ ఆధారిత ఫుడ్ రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని ఇటీవల ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి. మిల్లెట్స్ తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని...డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
ఫ్రాంటియర్స్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ఈ మధ్య ప్రచురించిన అధ్యయనం ప్రకారం, డయాబెటిక్, ప్రీ-డయాబెటిక్ వ్యక్తులకు మిల్లెట్స్ తో భోజనం ప్లాన్ చేసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్స్ లెవెల్స్ సాదారణ స్థాయికి వచ్చాయని సూచించింది. రోజువారీ ఆహారంలో భాగంగా మిల్లెట్స్ తీసుకునే మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 12-15% (ఉపవాసం మరియు భోజనం తర్వాత) తగ్గుతాయని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మునుపటి స్థాయికి వెళ్లినట్టు పరిశోధనలో గుర్తించారు. ఇండియన్ నేషనల్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రతినిధి, అధ్యయనం చేసిన వారిలో ఒకరైన డాక్టర్ రాజ్ భండారి ఏం చెప్పారంటే… వరి, గోధుమ, మొక్కజొన్న కన్నా ఉడకబెట్టిన మిల్లెట్స్ లో తక్కువ జిఐ ఉందని తేలిందన్నారు. మిల్లెట్స్ ను ఇలా మాత్రమే తినాలని ఏం లేదని… వాటిని ఉడకబెట్టడం, పిండి చేయడం , వాటిలో రోటీలు, ఇతర టిఫిన్లు తయారు చేసుకోవడం ద్వారా కూడా తినొచ్చన్నారు.
ALSO REad: ఉదయాన్నే ఇవి తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
తృణధాన్యాలు కొత్తగా వచ్చినవి కాదని, ఇవి మన పూర్వీకుల నుంచి వస్తున్న జీవామృతాలని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు, పలువురు వైద్యులు చెప్పారు. పాశ్య్చాత్య ఆహారపు అలవాట్లు విపరీతంగా పెరిగిపోవడంతో… ప్రజల్లో అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయన్నారు. తృణధాన్యాల్లో మనిషికి కావాల్సిన పూర్తిస్థాయి పోషక విలువలున్నాయని తెలిపారు. పసిపిల్లల దగ్గర నుంచే మధుమేహం, బీపీ వంటి రోగాలు వస్తున్నాయంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే లోపాలే అన్నారు. పూర్వీకులు అందించిన చిరుధాన్యాలను తిరిగి మనం వినియోగించి భవిష్యత్‌తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలని సూచించారు.
నోట్- ఓ అధ్యయనం, కొందరి నిపుణుల సూచనలు మాత్రమే ఈ కథనం. మరింత సమాచారం కోసం మీ వ్యక్తిగత ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించిన తర్వాతే మీ ఆహార పద్ధతుల్లో మార్పులు చేర్పులు చేసుకోగలరని మనవి…
ALSO REad: ఈ రాశులవారి ఆలోచనలు డబ్బుచుట్టూనే తిరుగుతాయ్…డబ్బు-పరపతి చూశాకే ప్రేమలో పడతారు…