News
News
X

Corona Deaths In India : కరోనా వల్ల భారత్‌లో ఎన్ని లక్షల మంది చనిపోయారంటే ? ఇదిగో ఇంటర్నేషనల్ రిపోర్ట్

కరోనా వల్ల ఇండియాలో 40 లక్షలమందికిపైగా చనిపోయారని మెడికల్ జర్నల్ లాన్సెట్ పరిశోధనలో వెల్లడయింది. మొత్తంగా ప్రపంచంలో కోటి 82 లక్షల మంది చనిపోయినట్లుగా అంచనా వేసింది.

FOLLOW US: 

ఇండియాలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎంత ?. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వద్ద అధికారిక డేటా లేదని చెప్పవచ్చు కానీ.. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన మరణాలు మొత్తం కలిపితే.. దాదాపుగా ఐదు లక్షలకుపైగా ఉంటారనే అంచనా ఉంది. ఇప్పటి వరకూ నాలుగున్నర కోట్ల మందికి పాజిటివ్‌గా తేలిందని.. మరణాలు అతి తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ అసలు నిజం వేరే ఉందని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రకటించింది. 

షాకింగ్, కరోనా వ్యాక్సిన్ల వల్ల లుకేమియా వచ్చే అవకాశం? చెబుతున్న చైనా ఆరోగ్య సంస్థ

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారి వివరాలు పూర్తి స్థాయిలో నమోదు కాలేదని .. నమదైన వాటి కంటే మరో రెండు రెట్లు ఎక్కువ మరణాలు సంభవించాలని లాన్సెట్ తాజాగా అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కోటి 82 లక్షల మంది మరణానికి కారణమయిందని తెలిపింది. భారతదేశంలో అధికారికంగా నమోదైన మరణాల కన్నా చాలా ఎక్కువ మంది చనిపోయారని లాన్సెట్ అంచనా వేసింది. భారత్‌లో కనీసం 40 లక్షల 70 వేల మంది చనిపోయి ఉంటారని విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారిలో 22 శాతం మంది భారతీయులే. 

షాకింగ్ ఫలితం, ఆ వ్యాక్సిన్ పిల్లలపై తక్కువ ప్రభావం చూపిస్తోందట, వేసినా ఏం లాభం?

కరోనా తీవ్రత అధికంగా ఉన్నప్పుడు 12 రాష్ట్రాల్లోని మరణాలను అధ్యయనం చేసినప్పుడు అధికారింగా నమోదైన వాటి కంటే 152 శాతం ఎక్కువ కరోనా మరణాలు చోటు చేసుకున్నట్లుగా గుర్తించామని లాన్సెట్ తన పరిశోధనా కథనంలో వివరించింది. లక్ష మంది కరోనా రోగులకు 18శాతానికి పైగా మరణాలు సంభవించినట్లుగా అంచనా వేశారు. ఇక కరోనా మరణాలు అత్యధికంగా సంభవించిన దేశాల్లో అమెరికా 11 లక్షలకుపైగా... రష్యాలో 10 లక్షలకుపైగా మరణాలు సంభవించినట్లుగా లాన్సెట్ తెలిపింది. మొత్తంగా భారత్, అమెరికా, రష్యా, మెక్సికో, బ్రెజిల్, ఇండొనేషియా , పాకిస్తాన్‌లో ప్రపంచం మొత్తం మీద చోటు చేసుకున్న మరణాల్లో సగానికిపైగా ఉంంటాయని తెలిపింది. 

కరోనా వైరస్ 2022లోనే అంతమయ్యే అవకాశం, చెబుతున్న డబ్య్లూహెచ్‌వో అధికారి

కరోనా మొదటి వేవ్‌ కన్నా.., రెండో దశలో భారత్‌లో అధిక మరణాలు సంభవించాయి. ఆ సమయంలో దేశంలోని స్మశానాల్లో ఖాళీ  ఉండేది కాదు. పెద్ద ఎత్తున ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చాలా ప్రాణాలు పోయాయి. ఆ సమయంలో రికార్డయిన కరోనా మరణాల కన్నా సాధారణ మరణాలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఆ లెక్కలన్నింటినీ ప్రభుత్వాలు ఖండించాయి. 

Published at : 11 Mar 2022 03:35 PM (IST) Tags: Corona Corona Deaths The Lancet Journal Covid Impact in India

సంబంధిత కథనాలు

Covid-19: కోవిడ్-19 లేదా డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

Covid-19: కోవిడ్-19 లేదా డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

Covid Vaccines: కరోనా టీకాల వల్ల దుష్ప్రభావాలు, కోటీ పది లక్షల మందిలో అనారోగ్య సమస్యలు!

Covid Vaccines: కరోనా టీకాల వల్ల దుష్ప్రభావాలు, కోటీ పది లక్షల మందిలో అనారోగ్య సమస్యలు!

Corona Cases: దేశంలో కొత్తగా 5 వేల కరోనా కేసులు- ఏడుగురు మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 5 వేల కరోనా కేసులు- ఏడుగురు మృతి

Vitamin D: 'విటమిన్- డి' సప్లిమెంట్స్ కరోనాని నిజంగానే అడ్డుకుంటాయా? క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయ్

Vitamin D: 'విటమిన్- డి' సప్లిమెంట్స్ కరోనాని నిజంగానే అడ్డుకుంటాయా? క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయ్

COVID-19: కరోనాతో 44 సెకన్లకి ఒకరు బలి - కలవరపెడుతున్న కోవిడ్ కొత్త నివేదిక

COVID-19: కరోనాతో 44 సెకన్లకి ఒకరు బలి - కలవరపెడుతున్న కోవిడ్ కొత్త నివేదిక

టాప్ స్టోరీస్

Balka Suman Followers : మంచిర్యాల జిల్లాలో తుపాకీ బుల్లెట్లతో వాట్సప్ స్టేటస్లు | DNN | ABP Desam

Balka Suman Followers : మంచిర్యాల జిల్లాలో తుపాకీ బుల్లెట్లతో వాట్సప్ స్టేటస్లు | DNN | ABP Desam

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!