News
News
X

జంక్ ఫుడ్ తినాలన్న కోరికని చంపేయాలంటే చేయాల్సిన పని ఇదే

జంక్ ఫుడ్ ఎవరినైనా త్వరగా తనకు బానిసను చేసుకుంటుంది. దాని రుచి దాసోహం అనేలా ఉంటుంది.

FOLLOW US: 
Share:

పిజ్జాలు, బర్గర్లు, తీపి పదార్థాలు, కేకులు, నూడిల్స్ ఇవన్నీ కూడా జంక్ ఫుడ్లోకే వస్తాయి. తినడం ప్రారంభిస్తే ఆపడం కష్టమే. వాటి రుచి మనల్ని దాసోహం అయ్యేలా చేస్తాయి. కానీ వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఊబకాయం, అధిక బరువు బారిన త్వరగా పడతారు. కాబట్టి జంక్ ఫుడ్ తినాలన్న కోరికలను అదుపు చేసుకోవడం చాలా అవసరం. అది అదుపు తప్పినప్పుడు ఒక చిన్న పని చేయడం ద్వారా  ఫాస్ట్ పుడ్ వైపు మనసు మళ్లకుండా చూసుకోవచ్చు. జంక్ ఫుడ్ తినాలన్న కోరిక అధికంగా కలిగేది ఆకలి వల్ల. లేదా ఖాళీగా ఉన్నప్పుడు కూడా జంక్ ఫుడ్ తినాలన్న కోరిక పుడుతుంది. కాబట్టి పొట్టని పూర్తి ఆకలితో ఉంచొద్దు. రెండు మూడు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటూ ఉండాలి. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి వాటి వల్ల కూడా ఫాస్ట్ ఫుడ్ తినాలన్న ఆలోచన వస్తుంది. ఆ రెండింటికి దూరంగా ఉంటే ఫాస్ట్ ఫుడ్ మీద ఆసక్తి ఉండదు. ఈ పనులు చేయడం కష్టం అనుకుంటే సింపుల్‌గా ఓ చిన్న పని చేయండి. చూయింగ్ గమ్ నోట్లో పెట్టి నములుతూ ఉండండి. దీనివల్ల ఒత్తిడి ఆందోళన వంటివి కూడా పోతాయి. అలాగే జంక్ ఫుడ్ మీద ఆసక్తి  తగ్గుతూ వస్తుంది. 

అపెటైట్ అనే జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఉదయం, మధ్యాహ్నం కనీసం 45 నిమిషాల పాటు చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆకలితో పాటూ, జంక్ ఫుడ్ పై ఆసక్తి తగ్గుతున్నట్టు తేలింది. మరొక అధ్యయనం కూడా ఇదే వాదనను సమర్ధించింది. చూయింగ్ గమ్ అధిక చక్కెర కలిగిన స్నాక్స్ తినాలన్న కోరికను తగ్గిస్తుందని, పొట్ట నిండిన అనుభూతిని పెంచుతుందని ఈ అధ్యయనం కూడా చెప్పింది. ఈటింగ్ బిహేవియర్స్ అనే జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో చూయింగ్ గమ్ నమలడం వల్ల కేవలం తీపిగా ఉండే పదార్థాలనే కాదు, ఉప్పగా ఉండే స్నాక్స్ ను తినాలన్న కోరికా తగ్గిపోతుందని తేలింది. వారి మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందని తెలిసింది. 

ఏమిటి కనెక్షన్?
జంక్ ఫుడ్ కోరికలకు, చూయింగ్ గమ్‌కు మధ్య కనెక్షన్ ఏంటి? అనే సందేహం ఎక్కువ మందికి వస్తుంది. చూయింగ్ గమ్ నయలడం వల్ల నోరు నిరంతరం పనిచేస్తుంది. ఇది ఏదైనా తినాలనే కోరికను తగ్గించేస్తుంది. నమలడం అనే ప్రక్రియ లాలాజలం, జీర్ణ ఎంజైముల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది పొట్ట నిండిన సంతృప్తి భావనను కలిగిస్తుంది. దీనివల్ల ఆకలి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆకలి తగ్గుతుందో, జంక్ ఫుడ్ మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది.

ఏ చూయింగ్ గమ్ బెటర్?
మార్కెట్లో అనేక రకాల చూయింగ్ గమ్ లు అందుబాటులో ఉన్నాయి. జంక్ ఫుడ్ ను తినకుండా చేసే చూయింగ్ గమ్ ఎంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తగా పాటించాలి. చక్కెరతో నిండిన చూయింగ్ గమ్ ను దూరం పెట్టాలి. చక్కెర రహితంగా ఉండే చూయింగ్ గమ్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని ఎంచుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా పుదీనా ఫ్లేవర్ ఉన్న చూయింగ్ గమ్ తింటే మంచిది. ఆకలిగా ఉన్నప్పుడు కూడా ఆకలిని చంపేయాలనుకుంటే దీన్ని కాసేపు నమిలితే ఆకలి తగ్గుతుంది. భోజనం చేశాక దీన్ని నమిలితే ఇది జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని మెరుగుపరిచి, జీర్ణక్రియ సులభతరం చేస్తుంది.

Also read: మన స్వాతంత్ర ఉద్యమంలో చపాతీది ప్రత్యేక పాత్ర, వాటిని చూసి భయపడి పోయిన బ్రిటిష్ అధికారులు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 04 Mar 2023 10:11 AM (IST) Tags: Chewing Gum Junk food Chewing gum for Health

సంబంధిత కథనాలు

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

Salt Side Effects: ఉప్పు ఎక్కువైతే ముప్పే - ఈ సూచనలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్!

Salt Side Effects: ఉప్పు ఎక్కువైతే ముప్పే - ఈ సూచనలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్!

అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు ఫ్రీ మెడికల్ క్యాంప్ - 10రోజుల పాటు

అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు ఫ్రీ మెడికల్ క్యాంప్ - 10రోజుల పాటు

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?