Cancer Treatment: కీమోథెరపీ ద్వారా ఇతర అవయవాలకు క్యాన్సర్ వ్యాప్తి: చైనా సైంటిస్టుల రీసెర్చ్
Chemotherapy treatment | క్యాన్సర్ వ్యాధి నివారణకు చేసే చికిత్స ద్వారా ఇతర అవయవాలకు సైతం సమస్య వ్యాప్తి చెందే అవకాశం ఉందని, చైనా రీసెర్చర్లు షాకింగ్ విషయాలు వెల్లడించారు.

Cancer Treatment Chemotherapy | బీజింగ్: క్యాన్సర్ బారిన పడిన వారికి కీమోధెరపి చికిత్స అందిస్తుంటారు డాక్టర్లు. అయితే ఈ కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ మరిన్ని అవయవాలకు వ్యా్ప్తి చెందే అవకాశం ఉందని చైనా శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. క్యాన్సర్ కణితి సమస్య ఇతర అవయవాలకు వ్యాప్తిచెందడం, ఇతర అవయవాల్లో క్యాన్సర్ కణాలు యాక్టివ్ అవుతాయని తెలిపారు. చికిత్స తరువాత రొమ్ము క్యాన్సర్ పేషెంట్లు కోలుకున్నప్పటికీ వారి ఊపిరితిత్తులు లాంటి ఇతర అవయవాలలో క్యాన్సర్ మెటాస్టాసిస్ కనిపించడంపై రీసెర్చ్ జరిగింది.
కీమోథెరపీ(Chemotherapy)తో క్యాన్సర్ కణాలు యాక్టివ్
కీమోథెరపీలో కొన్ని ఇతర ఔషధాలు కలిపి వాడకం ద్వారా ఇతర అవయవాలకు క్యాన్సర్ వ్యాప్తి జరగకుండా ప్రయోగాలు చేస్తున్నారు. ఎలుకలలో, రొమ్ము క్యాన్సర్ రోగులలో క్లినికల్ ట్రయల్ కొనసాగుతున్నాయి. "డోక్సోరోబిసిన్, సిస్‌ప్లాటిన్‌తో సహా కెమోథెరపీటిక్ మెడిసిన్ యాక్టివ్ గా లేని రొమ్ము క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందుతాయి. ఊపిరితిత్తుల మెటాస్టాసిస్‌ను ఇవి పెంచుతాయని చైనా సైంటిస్ట్ టీమ్ జూలై 3 న పీర్-రివ్యూడ్ జర్నల్ క్యాన్సర్ సెల్‌లో ప్రచురించింది.
ఇతర భాగాలలో క్యాన్సర్ (Cancer) కణతులు
చైనా నిపుణుల అధ్యయనం నిద్రాణస్థితి (In Active Cancel Cells) నుంచి క్యాన్సర్ కణాలు యాక్టివ్ కావడానికి ఆధారాలను అందిస్తుంది. మెటాస్టాసిస్‌పై కెమోథెరపీ హానికరమైన ప్రభావం చూపుతుంది. క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని ఇది సూచిస్తుంది. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ అధికంగా చేయడం మెటాస్టాటిక్ కణితుల పెరుగుదలకు దారితీస్తాయని అమెరికా రీసెర్చర్స్ గతంలో కనుగొన్నారు. ప్రాధమిక కణితులకు చికిత్స చేయడానికి కీమోథెరపీ చేయించుకున్న పేషెంట్లలో అసలు కణతి నుంచి కోలుకుంటున్నారు. కానీ ఇతర అవయవాలలో క్యాన్సర్ కణాలు వ్యాప్తిచెందుతున్నాయి. దాంతో కెమోథెరపీ ద్వారా ఇదే సమస్య తలెత్తుతుందా అని పరిశోధన మొదలైంది. క్యాన్సర్ మెటాస్టాసిస్‌ను ప్రేరేపిస్తుందని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS) ప్రకారం, ప్రాథమిక కణితుల నుండి శరీరంలోని ఇతర అవయవాలకు క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందుతాయి. క్యాన్సర్ కణతి గుర్తించిన సమయంలో ఇతర భాగాల్లోనూ కణతులు ఉంటాయి. కానీ అవి స్లీపింగ్ స్టేట్ (నిద్రాణమైన స్థితి)లో ఉండి, పెరగవు. కానీ కీమోథెరపి ద్వారా అవి యాక్టివ్ అవుతాయి. డిటిసి (Disseminated Tumour cells) క్యాన్సర్ కణాల వ్యాప్తి అర్థం చేసుకుంటే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వారికి మెరుగైన చికిత్స అందించవచ్చు.
బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లలో సైడ్ ఎఫెక్ట్స్
కాస్ షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ప్రొఫెసర్ హు గుహోంగ్ నేతృత్వంలోని సైంటిస్టుల బృందం, ఫుడాన్ యూనివర్సిటీ, షాన్డాంగ్ వర్సిటీకి చెందిన కిలు హాస్పిటల్ పరిశోధకులతో పాటు క్యాన్సర్ కణాల ట్రేసింగ్ విధానాన్ని కనుగొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు కీమోథెరపి చేయించుకుంటే ఊపిరితిత్తులలో క్యాన్సర్ కారకాలు, కణతులు యాక్టివ్ అవుతున్నాయని రీసెర్చ్ టీమ్ తెలిపింది. ట్రీట్మెంట్ ద్వారా వేగంగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.
న్యూట్రోఫిల్స్ అనే రోగనిరోధక కణాలు న్యూట్రోఫిల్ ఎక్స్‌ట్రాసెల్యులర్ ట్రాప్స్ అనే రోగనిరోధక కణాలను కలిగి ఉన్న ప్రోటీన్లను సెనెసెంట్ ఫైబ్రోబ్లాస్ట్‌లు విడుదల చేస్తాయి. ఇది ఊపిరితిత్తుల్లో నిద్రాణమైన క్యాన్సర్ కణాలను యాక్టివ్ చేస్తుంది. కొత్త కణతి పెరిగే అవకాశం ఉంది. మెటాస్టాసిస్ నిరోధంపై కెమోథెరపీ ప్రభావాన్ని మెరుగుపరచడానికి అన్వేషించారు.
చికిత్సకు మార్గం ఇదే..
సెనోలైటిక్ ఔషధాలను కలపడంతో ఇది సెనెసెంట్ కణాలను తొలగిస్తుంది. కెమోథెరపీ డ్రగ్ డోక్సోరోబిసిన్ ఎలుకల ఊపిరితిత్తులలో సెనెసెంట్ ఫైబ్రోబ్లాస్ట్‌లను తగ్గించినట్లు రీసెర్చర్లు కనుగొన్నారు. దీనిపై క్లినికల్ ట్రయల్స్ జరగాలని వారు కోరారు.
ఈ అధ్యయన ఫలితాలతో ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు కెమోథెరపీలో సెనోలైటిక్ డ్రగ్స్ దాసాటినిబ్, క్వెర్సెటిన్‌లను కలపాలని ఫేజ్ II క్లినికల్ ట్రయల్ జరగనుంది. ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ అనేది వ్యాధి దూకుడు రూపం. ఇలాంటి రకం క్యాన్సర్లకు సాధారణ హార్మోన్ చికిత్స చేయకూడదని చైనా సైంటిస్టులు తెలిపారు.






















