Blood Cancer : భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఎఫైర్ పెట్టుకున్న భర్త.. కట్ చేస్తే బిడ్డకు బ్లడ్ క్యాన్సర్, కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Pregnancy Stress on Baby : భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెపై నెగటివ్ ప్రభావాలు వస్తే, అది కడుపులోని బిడ్డపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుందని క్యాన్సర్ స్పెషలిస్ట్ హెచ్చరిస్తున్నారు.

Husband Affair During Wife’s Pregnancy : క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సరైన లైఫ్‌స్టైల్ మెయింటైన్ చేయకపోతే.. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉంటే.. తీసుకునే ఫుడ్.. ఇలా ఎన్నో విషయాలు ప్రభావితం చేస్తాయి అంటారు. కానీ పుట్టి పది రోజులు కూడా అవ్వని ఓ బేబికి బ్లడ్ క్యాన్సర్ వస్తే.. దానికి వెనుక డాక్టర్ చెప్పిన కారణాలు వింటే కచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఏమి జరిగింది? పదిరోజుల బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణమేంటి?
వయసుతో తేడా లేకుండా వచ్చే మహమ్మారి క్యాన్సర్. అయితే రోజుల బిడ్డని కూడా ఎందుకు వదల్లేదు? బిడ్డ పుట్టిందని సంతోషించాలో.. లేక ఇలాంటి పరిస్థితి ఎదురైందని బాధపడాలో తెలియని ఘటన ఇది. రీసెంట్గా ఓ పాడ్‌కాస్ట్‌లో క్యాన్సర్ హీలర్ సెంటర్ కోచ్, MD డాక్టర్ తరంగ్ కృష్ణ ఈ షాకింగ్ ఘటన గురించి వివరించారు. దానిలో ఆయన ఏమి చెప్పారో ఇప్పుడు చూసేద్దాం.
భర్త ఎఫైర్
పాడ్‌కాస్ట్‌లో భాగంగా డాక్టర్ తరంగ్ కృష్ణ ఏమి చెప్పారంటే.. పదిరోజుల బిడ్డని పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ బేబికి బ్లడ్ క్యాన్సర్. ఈ విషయం గురించి వారిని కొన్ని ప్రశ్నలు అడగ్గా.. వారు జవాబు చెప్పారు. భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు భర్తకు ఆఫీస్‌లో ఎఫైర్ మొదలైంది. ఈ విషయం భార్యకు తెలిసి ప్రశ్నించడంతో.. అతను అఫైర్‌ని వదులుకోకపోగా.. ఆమెను కొట్టడం, తిట్టడం ప్రారంభించాడని తెలిపారు.
ఈ బాధను మెదడు మర్చిపోయినా, శరీరం మాత్రం గుర్తుపెట్టుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్‌గా ఉండడంతో ఆ ఎఫెక్ట్ లోపలి బేబిపై పడింది. నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ట్రోమా అనేది ఇన్ఫెర్టిలిటీ సమస్యలను రెట్టింపు చేస్తుంది. అలాగే కడుపులోని బేబిపై కూడా ఆ ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు.
"Since she was expecting all those negative emotions went to the child and there, God forbid, this was been diagnosed."
కారణం అదే..
అందుకే ప్రెగ్నెన్సీతో ఉన్నవారిని మంచిగా ఆలోచించమని.. మంచిగా ఉండమని సూచిస్తామని కూడా తెలిపారు. ఫ్యామిలీ కూడా వారిని బాగా చూసుకుంటే.. బేబీ హెల్త్ బాగుంటుందని, ఆమె ఎన్ని కష్టాలు పడాల్సి వస్తే ఆ ఎఫెక్ట్ అంతా బేబీపై ఉంటుందని చెప్తున్నారు. Fetal Programming, Fetal Memory వల్లనే ఇలా జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే తల్లికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైతే.. కడుపులోని బిడ్డ కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తుందని తరంగ్ తెలిపారు. గర్భిణీగా ఉన్నప్పుడు టైమ్‌కి మెడిసన్స్ వేసుకోకపోతే బేబిని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో.. ఇది కూడా అలాంటిదేనని తెలిపారు.
కాబట్టి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఆమె సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబంపై ఉంటుంది. ఆమె సంతోషంగా తిని, సంతోషంగా ఉన్నప్పుడు హెల్తీ బేబీని డెలివరీ చేయగలుగుతుంది. చాలామంది ఇది తెలియక వైఫ్ దూరంగా ఉన్నప్పుడు వేరే రిలేషన్లోకి వెళ్తుంటారు. భార్యకి తమ అవసరం ఉందని మరచిపోతారు. ఇలా చేస్తే మీ ఫ్యూచర్ జనరేషనే కష్టాల్లో పడుతుందని గుర్తించాలి.
కాబట్టి గర్భిణీ మహిళలను మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూడటం ప్రతి కుటుంబ సభ్యుని బాధ్యత అవ్వాలి. వారు సంతోషంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన పిల్లలు వస్తారు. మంచి భవిష్యత్తుకి పునాది అవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని, మాట.. కడుపులోని బిడ్డకు ఒక ఆశీర్వాదం అవుతుంది. భార్యదే కదా ప్రెగ్నెన్సీ బాధ్యత అనుకుని విస్మరిస్తే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి.






















