తల్లి ఓ బిడ్డకు జన్మనివ్వాలంటే ఎంత నొప్పిని అనుభవించాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రతి ఏటా పిల్లలకు జన్మనిచ్చేప్పుడు ఇండియాలో ఎంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా?

2021 నివేదిక ప్రకారం 2014-16 సంవత్సరంలో ప్రతి లక్ష ప్రసవాలకు 130 మంది చనిపోతున్నారట.

2019 సంవత్సరంలో ఈ మరణాల సంఖ్య 93కి తగ్గిందని నివేదికలు పేర్కొన్నాయి.

ఈ నివేదికలో తల్లుల మరణాల సంఖ్య మాత్రమే కాకుండా పిల్లల మరణాల సంఖ్య కూడా ఇచ్చింది.

2014లో సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాల సంఖ్య వెయ్యిమందికి 39 మంది చనిపోతున్నారట.

ఇప్పుడు ఈ సంఖ్య 29కి తగ్గినట్లు పేర్కొన్నారు. అంటే 1000 మంది పిల్లలకు 27 మంది చనిపోతారట.

అదే సమయంలో పుట్టిన కొన్నిరోజుల్లోనే మరణించే పిల్లల సంఖ్య కూడా తగ్గినట్లు నివేదికలు చెప్తున్నాయి.

2014-15కు గానూ ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాల సంఖ్య 45 ఉండగా.. 31 తగ్గింది.