News
News
X

Beetroot: డయాబెటిస్, గుండె సమస్యలుంటే బీట్ రూట్ తినొచ్చా?

హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుకునేందుకు అందరూ క్యారెట్ తర్వాత ఎంచుకునే కూరగాయ బీట్ రూట్. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.

FOLLOW US: 
Share:

బీట్ రూట్ తినాలంటే చాలా మంది మొహం తిప్పేస్తారు. కానీ దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అటు ఆరోగ్యానికి, ఇటు అందానికి రెండు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. మధుమేహంతో జీవించే వారికి ఇది మంచి ఆహార పదార్థం. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా బీట్ రూట్ తినొచ్చు. అంతేకాదు, గుండె సమస్యలతో బాధపడుతున్నవారు సైతం విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉన్నందున అద్భుతమైన పోషకాహారంగా నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకం ఇది. రక్తం నుంచి చక్కెరని తొలగించడంలో సహాయపడుతుంది. ఈ దుంపలో అధిక మొత్తంలో ఉండే నైట్రేట్ ఇన్సులిన్ నిరోధకతని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇతర రూట్ వెజిటబుల్స్ తో పోలిస్తే బీట్ రూట్‌లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అందుకే దీన్ని తినడం వల్ల పొట్ట నిండిన అనుభూతి ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణం వాపును తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది. రెటినోపతి, కిడ్నీ వ్యాధులు, న్యూరోపతి, డయాబెటిక్, కార్డియోవాస్కులర్ డిసీజ్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

తరచూ దీన్ని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలని పెంచుతుంది. ఇందులో ఉండే బెటాసైనిన్ కణితుల పెరుగుదలని తగ్గిస్తుంది. దీని అత్యధిక పోషకాల్ని పొందాలంటే పచ్చి దుంపలు లేదా నీటిలో ఉడకబెట్టి లేదా కాల్చుకుని తినొచ్చు. మిగతా ఆహారాల మాదిరిగానే బీట్ రూట్ కూడా మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది.

కాల్చిన బీట్ రూట్ చిప్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇక ఊరగాయ బీట్ రూట్ తీసుకోవడం వల్ల జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంచేందుకు సహాయపడే ప్రోబయోటిక్స్ ని అందిస్తుంది. బీట్ రూట్ చర్మానికి కూడా మేలు చేస్తుంది. బీట్ రూట్ రసం పెదవులకి రాసుకోవడం వల్ల ఎర్రగా మారతాయి. ఇంట్లోనే బీట్ రూట్ తో లిప్ బామ్ తయారు చేసుకుని రాసుకుంటే చాలా మంచిది.

జ్యూస్ గా తీసుకోకపోవడమే ఉత్తమం

బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఆక్సలేట్ కాల్షియంతో కలిసి రాళ్లను పెంచుతుంది. అందుకే బీట్ రూట్ జ్యూస్‌కు మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. ఇక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారైతే బీట్ రూట్ తినకూడదు. అలర్జీ బారిన పడే వాళ్ళు దీన్ని తీసుకోకపోవడమే మంచిది. బీట్ రూట్ అధికంగా తినడం వల్ల అనాఫిలాక్సస్ అనే అలర్జీ బారిన పడతారు. అధిక నైట్రేట్లు ఉండే బీట్‌రూట్ గర్భిణులు తినడం వల్ల శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లు, నోరు, పెదవులు, చేతులు, కాళ్ల చుట్టూ చర్మం రంగు మారుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు బీట్ రూట్ కి దూరంగా ఉండటమే మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: నటుడు అజిత్ ఫేవరెట్ తాలా బిర్యానీ- సింపుల్ గా ఇలా ఇంట్లోనే చేసేయొచ్చు

Published at : 13 Jan 2023 04:56 PM (IST) Tags: Beetroot Juice Beetroot Beetroot Benefits Healthy Food Beetroot Side Effects

సంబంధిత కథనాలు

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

టాప్ స్టోరీస్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?