అన్వేషించండి

PMJAY : సీనియర్ సిటిజన్స్‌ ఆయుష్మాన్ భారత్‌ సేవలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు?

PM Ayushman Bharat Yojana: దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ఉన్న సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరుస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ఉన్న సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరుస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్ల పైబడిన సీనియర్ సిటజన్‌లకు 5 లక్షల రూపాయల బీమాను  అందించనుంది. ఈ మేరకు గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం మానవతాదృక్పథంతో తీసుకున్న గొప్ప నిర్ణయంగా పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం.. అప్పటికే ఇంట్లో ఉన్న వాళ్లకు ఆయుష్మాన్ భారత్‌ కింద అందుతున్న ఉచిత వైద్య సదుపాయాలకు ఇది అదనంగా వెల్లడించింది.

దేశవ్యాప్తంగా నాలుగున్న కోట్ల కుటుంబాలు ఈ లబ్ధి పొందుతారని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్‌ స్కీమ్ లబ్ధిదారులుగా ఉన్న సీనియర్‌ సిటిజన్లు యాప్‌ ద్వారా ఆయుష్మన్ యోజన సేవలు పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది. దీనికి సంబంధించి ఒక వారంలో ఆర్డర్లు వెలువడనుండగా.. నెలలోగా ఆ యాప్‌ను కేంద్ర సర్కారు లాంచ్ చేయనుంది. అంతే కాకుండా ప్రజలకు ఈ యాప్‌ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. ఐతే ఆయుష్మాన్ భారత్ హెల్త్‌ స్కీమ్‌ అమలుకు అంగీకారం తెలపని ఢిల్లీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ లోని సీనియర్ సిటిజన్లు ఈ సేవలు కోల్పోనున్నారు.

ఈ పథకం ద్వారా దేశంలో సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నామని ప్రధాని ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఆయుష్మాన్ భారత్‌ కింద సేవలు పొందుతున్న కుటుంబాల్లో ఉన్న వృద్ధులకు దానితో సంబంధం లేకుండా మరో ఐదు లక్షల రూపాయల వరకూ విలువైన  వైద్య సేవలు పొందేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ వేరే ఏవైనా ఆరోగ్య బీమా సేవలు పొందుతూ ఉంటే వాటి కింద అయినా లేదా ఆయుష్మాన్ భారత్‌ను అయిన ఎంచుకోవచ్చు.

Also Read: ట్రైనీ ఆర్మీ అధికారి ఎదుటే స్నేహితురాలిపై గ్యాంగ్‌ రేప్‌, తీవ్రంగా స్పందించిన రాహుల్‌

ఆయుష్మాన్ భారత్ ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల 34 లక్షల కుటుంబాల నుంచి 55 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని.. ఇది భారత్‌లో దారిద్ర్య రేఖ దగ్గర ఉన్న 40 శాతం జనాభాకు సమానమని కేంద్రం వెల్లడించింది. 2018లో ప్రధాన మంత్రి చైతుల మీదుగా ఆయుష్మాన్ భారత్‌ యోజన ప్రారంభం కాగా.. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల మేర విలువైన వైద్య సేవలు అందించేందుకు ఆయుష్మాన్ కార్డు అందిస్తున్నారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్లుంటే ఆ కుటుంబం మరో ఐదు లక్షల రూపాయల మేర అదనపు సేవలు పొందనుంది.

వీటితో పాటు గురువారం నాటి కేబినెట్ భేటీలో కేంద్రం మరికొన్ని నిర్ణయాలను కూడా తీసుకుంది. దేశవ్యాప్తంగా 88 వేల 500 ఛార్జింగ్‌ స్టేషన్‌లకు తోడ్పాడు కల్పించేందుకు పీఎం- ఈడ్రైవ్ పథకం కింద 10 వేల 900 కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన నాల్గవ దశ కింద రోడ్ కనెక్టివిటీ లేని దాదాపు 25వేల హాబిటెంట్స్‌ను కలిపేలా 65 వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ఆమోదం తేలిపింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్ల వ్యవధిలో 70 వేల కోట్లు ఖర్చు చేయనుంది. వాతావరణ మార్పుల అధ్యయనానికి 2 వేల కోట్ల మేర నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  

Also Read: ఢిల్లీలో రోడ్లపై నడవడం అంత ప్రమాదకరమా? రాత్రి 9 నుంచి 2 గంటల వరకు అసలు బయటకు రావద్దా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
CM Chandrababu: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
Hussain Sagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
Rajinikanth - Salman Khan: సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
CM Chandrababu: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
Hussain Sagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
Rajinikanth - Salman Khan: సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
సల్మాన్, రజనీతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న 'జవాన్' డైరెక్టర్?
Phone Tapping Case: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వచ్చేనా ?
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వచ్చేనా ?
Revant 10 years CM: పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
పదేళ్ల పాటు సీఎం పదవి ఖాయం - రేవంత్ నమ్మకానికి లాజిక్కు ఉందా ?
YSRCP Dual Role: జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
జనసేన ఫ్యాన్స్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు - కూటమిలో చిచ్చు - సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారా ?
Padma Bhushan Balakrishna: ‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
‘అఖండ 2’ సెట్స్‌లో ‘ఆనంద’ తాండవం.. మ్యాటర్ ఏంటంటే?
Embed widget