Rahul Gandhi: ట్రైనీ ఆర్మీ అధికారి ఎదుటే స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్, తీవ్రంగా స్పందించిన రాహుల్
Telugu News: మధ్యప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. ట్రైనీ ఆర్మీ అధికారుల కళ్లెదుటే స్నేహితురాలిపై దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడడం కలకలం రేపింది.
Madhya Pradesh News: కోల్‌కత ఆర్జీకర్ ఆస్పత్రి ఉదంతం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమవుతున్న వేళ.. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో మరో ఘోరం జరిగింది. ట్రైనీ ఆర్మీ అధికారుల కళ్లెదుటే తమ స్నేహితురాలిపై కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడడం కలకలం రేపింది. ఇండోర్‌లోని మోవ్ ఆర్మీ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువ ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి ఒక విజిటర్స్ స్పాట్‌కు వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. తొలుత దుండగులు వారిపై దాడి చేసి ఆర్మీ అధికారులను ఇద్దరినీ కొట్టారు. ఆ తర్వాత వాళ్ల దగ్గర ఉన్న బంగారం, డబ్బులు దోచుకున్నారు. అనంతరం కాసేపటి తర్వాత ఆ ఇద్దరి స్నేహితురాళ్లలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడి నుంచి తప్పించుకు వెళ్లిన ఒక అధికారి.. దగ్గర్లోని పోలీసు స్టేషన్‌తో పాటు తమ ఆర్మీ అధికారులు విషయాన్ని చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడకు వచ్చే సరికి దుండగులు పారిపోయారు. బాధిత యువతిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు గ్యాంగ్ రేప్‌కు గురైనట్లు తేలింది. నిందితుల్లో ఇద్దరిని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. వీరికి ఇప్పటికే నేరచరిత్ర ఉన్నట్లు తేలింది.
ఇంకా ఎంత కాలం మీ కళ్లు మూసుకునే ఉంటారంటూ మధ్యప్రదేశ్ సర్కార్‌పై రాహుల్ విమర్శలు గుప్పించారు.
मध्य प्रदेश में सेना के दो जवानों के साथ हिंसा और उनकी महिला साथी के साथ दुष्कर्म पूरे समाज को शर्मसार करने के लिए काफी है।
— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2024
भाजपा शासित राज्यों की कानून व्यवस्था लगभग अस्तित्वहीन है - और, महिलाओं के खिलाफ़ दिन प्रतिदिन बढ़ते अपराधों पर भाजपा सरकार का नकारात्मक रवैया अत्यंत…
ఈ అత్యాచార ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ X వేదికగా తీవ్రంగా స్పందించారు. ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి చేసి వారి స్నేహితురాలిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారన్న ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ ఉదంతం సమాజాన్ని సిగ్గుపడేలా చేసిందన్న రాహుల్.. BJP అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళల భద్రతకు ముప్పు ఏర్పడిందని దుయ్యబట్టారు. రోజురోజుకూ ఆడవాళ్లపై దాడులు జరుగుతున్నా భాజపా సర్కారు ప్రదర్శిస్తున్న ఉదాసీనతతో నేరగాళ్లు మరింతగా చెలరేగి పోతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘోరాలు మహిళల కలల సాకారానికి అడ్డుగోడల్లా నిలుస్తున్నాయని.. ఇకనైనా భాజపా సర్కారు కళ్లు తెరిచి నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
मध्य प्रदेश में सेना के अधिकारियों को बंधक बनाकर महिला से गैंगरेप एवं उत्तर प्रदेश में हाईवे पर एक महिला का निर्वस्त्र शव मिलने की घटनाएं दिल दहलाने वाली हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 12, 2024
देश में हर दिन 86 महिलाएं बलात्कार और बर्बरता का शिकार हो रही हैं। घर से लेकर बाहर तक, सड़क से लेकर दफ्तर तक, महिलाएं…
ఈ ఘటనపై మరో కాంగ్రెస్ నేత రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా భాజపా సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనతో పాటు ఉత్తర ప్రదేశ్‌లో వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించడం గుండెలని తీవ్రంగా కలచి వేసే అంశాలన్న ప్రియాంక..
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 86 మంది మహిళలపై దారుణ ఘటనలు నమోదవతున్నాయన్నారు. ఇంట్లో రోడ్డుమీద, పని ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లు దాడులకు గురవుతున్నారన్నారు. మహిళల గురించి గొప్పగా చెప్పే మన ప్రధాన మంత్రి మాత్రం ఈ దారుణాలపై పెదవి విప్పరెందుకో అని విమర్శించారు. ఈ దారుణాలతో దేశ జనాభాలో సగం ఉన్న మహిళల మనోధైర్యం దిబ్బతింటోందని ప్రియాంక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ దారుణాల కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించి.. ఈ దారుణాలకు ఎండ్ కార్డు పడే రోజు కోసం ఎదురు చూస్తున్నానన్నారు.