News
News
X

కొవ్వు కరిగి బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజు ఉసిరి టీ తాగండి

బరువు తగ్గాలనుకునే వారికి ఒక సింపుల్ చిట్కా ఉసిరితో చేసే టీ.

FOLLOW US: 
Share:

ఆయుర్వేదంలో ప్రతి ఆరోగ్య సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. అలాగే శరీరంలో కొవ్వు పట్టి, అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు వ్యాయామంతో పాటు ఉసిరిటీ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారని చెబుతోంది ఆయుర్వేదం. ఉసిరిలో ఉండే గుణాలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయని చెబుతోంది. చలికాలంలో ఈ ఉసిరి టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు రావని వివరిస్తుంది. కొందరికి రెండు గంటలకు ఒకసారి టీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీలు, టీలు అలా అధికంగా తాగడం వల్ల శరీరంలో కెఫీన్ అధికంగా చేరి, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం కూడా ఇబ్బంది పడవచ్చు. ఆ టీలలో పంచదార కూడా కలుపుతారు. దీని వల్ల డయాబెటిస్ ముప్పు ఇంకా పెరుగుతుంది. కాబట్టి రెండు మూడు గంటలకు ఒకసారి టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు, సాధారణ టీలను వదిలిపెట్టి ఉసిరి టీని తాగండి. ఇందులో ఎలాంటి పంచదార కలపరు. దీన్నీ తాగడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా. ఇందులో విటమిన్ సి, పీచు పదార్థం, క్యాల్షియం వంటివి శరీరానికి అందుతాయి.

ఎలా తయారు చేయాలి?
రెండు ఉసిరికాయలు, చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. ఉసిరికాయలోని గింజను బయటపడేసి మిగతా భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మీకు ఎంత టీ కావాలి అనుకుంటున్నారో అన్ని నీళ్లు పెట్టి అందులో ఉసిరి, అల్లం ముక్కలు వేసి మరిగించాలి. మరుగుతున్న నీటిలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి కూడా వేయాలి. వేసిన వెంటనే స్టవ్ కట్టేయాలి. స్పూన్ తో బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి. తర్వాత వడకట్టి తాగేయాలి. రోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఉసిరి, అల్లం రెండూ కూడా చలికాలంలో శరీరానికి రక్షణ కల్పించేవే. ఉసిరికాయ అందుబాటులో లేనప్పుడు బయట దొరికే ఉసిరి పొడిని కూడా కలుపుకోవచ్చు. అలాగే శొంటి పొడి కూడా ఉపయోగించవచ్చు. వీటిని తాగడం వల్ల కొవ్వు తగ్గుతుందని, బరువు కూడా త్వరగా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో ఉసిరికాయని మించిన మందు మరొకటి లేదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మం త్వరగా ముడతలు పడదు. అంటే అందంపరంగా  ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తాయి. మధుమేహం ఉన్న వారికి కూడా ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఉసిరిలో ఉండే క్రోమియం ఇన్సులిన్‌ను పెంచి, చక్కెర నిల్వలని తగ్గిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి కూడా ఉసిరికి ఉంది. కాబట్టి సాధారణ టీ కాఫీలను వదిలి ఉసిరి టీని ట్రై చేయండి. కొన్ని రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. 

Also read: పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువగా ఉందా? అయితే మీరు వీటిని తింటే మేలు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 09 Jan 2023 06:53 AM (IST) Tags: Ayurvedam Amla Benefits Usiri Tea Amla tea

సంబంధిత కథనాలు

కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం

కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం

Triphala Churnam: త్రిఫల చూర్ణం తీసుకుంటే అందం, ఆరోగ్యం- దాన్ని ఎలా తీసుకోవాలంటే?

Triphala Churnam: త్రిఫల చూర్ణం తీసుకుంటే అందం, ఆరోగ్యం- దాన్ని ఎలా తీసుకోవాలంటే?

Belly Fat: పొట్ట దగ్గర కొవ్వు కరగడం లేదా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చేసి చూడండి

Belly Fat: పొట్ట దగ్గర కొవ్వు కరగడం లేదా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చేసి చూడండి

Stomach Bloating: పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే ఆ సమస్య ఉండదు

Stomach Bloating: పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే ఆ సమస్య ఉండదు

Water: నిలబడి నీళ్ళు తాగుతున్నారా? అలా అసలు చేయొద్దు, ఈ సమస్యలు వేధిస్తాయ్

Water: నిలబడి నీళ్ళు తాగుతున్నారా? అలా అసలు చేయొద్దు, ఈ సమస్యలు వేధిస్తాయ్

టాప్ స్టోరీస్

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?

Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!